అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Traffic Barricades Distribution | జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత (nizamabad news) విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు (Nizamabad Traffic Police Station) బారికేడ్లు, హోర్డింగ్‌లను బుధవారం అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వీటిని లాంఛనంగా అందజేశారు.
Traffic Barricades Distribution | బేటీ బచావో.. బేటీ పడావో..
బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజలలో అవగాహన పెంపొందించేలా బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత విభాగం వారిని ప్రశంసించారు. బాలికలు, మహిళల సహాయం కోసం (traffic police support) ఉద్దేశించిన హెల్ప్‌లైన్ నెంబర్లతో రూపొందించిన హోర్డింగ్‌లను కలెక్టర్ పరిశీలించారు. వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లు (government initiatives), రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఇవి ఉపకరించడంతో పాటు మహిళా సాధికారతపై ప్రజల్లో అవగాహన పెంపొందేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ (Department of Women and Child Welfare) అధికారిణి పద్మ అనిల్, మహిళా సాధికారత విభాగం సమన్వయకర్త స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
