అక్షరటుడే, ఆర్మూర్: TNGOs Union Meeting | టీఎన్జీవోస్ (tngos union) అంటేనే ఐకమత్యానికి మారుపేరని ఎంప్లాయీస్ జేఏసీ (employee jac) జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ఆర్మూర్ టీఎన్జీఎస్ (TNGOs Nizamabad) భవనంలో బుధవారం టీఎన్జీవోస్ ఆర్మూర్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
TNGOs Union Meeting | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి..
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య (armoor news) అతిథిగా హాజరై మాట్లాడుతూ.. టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు (government employees news) ఉద్యోగులతో మమేకమై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాబోయే కాలంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
TNGOs Union Meeting | ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడిగా శశికాంత్ రెడ్డి
ఆర్మూర్ యూనిట్ అధ్యక్షుడిగా కుంట శశికాంత్ రెడ్డి (వ్యవసాయ శాఖ), యూనిట్ కార్యదర్శిగా న్యాల్కల్ విశాల్ (ట్రెజరీ శాఖ), కోశాధికారిగా సాయి కుమార్ (రోడ్డు, భవనాల శాఖ), అసోసియేషన్ ప్రెసిడెంట్గా లయన్ శేఖర్ (సీనియర్ అసిస్టెంట్ ఆర్మూర్ మున్సిపల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, (union elections)రాష్ట్ర నాయకులు పెంట జలంధర్, నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, భీమ్గల్ యూనిట్ అధ్యక్షుడు సృజన్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మాణిక్యం, పద్మ, నీరంజన్ గౌడ్, స్వామి, సునీల్, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy CI Appointment | కామారెడ్డి రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
