Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం

తెలంగాణ

Bhu Bharati portal | భూ సమస్యలకు చెక్​.. రేపు భూ భార‌తి పోర్ట‌ల్‌ ప్రారంభం

భూ భారతి పోర్టల్​ను ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది. ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో అమలు చేయనుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 8:33 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Bhu Bharati portal

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhu Bharati portal | రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పడానికి సిద్ధమైంది. ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇంటిగ్రేటేడ్​ భూ భారతి పోర్టల్​ను గురువారం ప్రారంభించనుంది. ప్రయోగాత్మకంగా తొలుత దీనిని ఐదు మండలాల్లో అమలు చేయనున్నారు.

Contents
  • Bhu Bharati portal | ప్రయోగాత్మకంగా..
  • Bhu Bharati portal | ఇంటి నుంచే సేవలు

రాష్ట్రంలో భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌న్న సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచ‌న మేర‌కు రెవెన్యూ శాఖ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన సంస్క‌ర‌ణ‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి (Ponguleti) తెలిపారు. రైతుల‌కు పార‌ద‌ర్శ‌కంగా, సుల‌భ‌త‌ర‌మైన‌ సేవ‌లు అందించ‌డానికి ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ భూ భారతి పోర్టల్ తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

Bhu Bharati portal | ప్రయోగాత్మకంగా..

భూ భారతి పోర్టల్​ను ఈనెల 2 నుంచి రంగారెడ్డి (Rangareddy) జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లి, నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేట‌ మండ‌లాల్లో పోర్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి. కేర‌ళ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి పొంగులేటి బుధవారం అధికారులతో భూ భారతిపై టెలి కాన్ఫరెన్స్​ నిర్వహించారు. క‌లెక్ట‌ర్లు పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

Bhu Bharati portal | ఇంటి నుంచే సేవలు

రైతులు త‌మ భూ సేవ‌ల కోసం మీ సేవ కేంద్రాల‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి నుంచే సేవ‌లు పొందేవిధంగా పోర్టల్​ రూపొందించినట్లు పొంగులేటి తెలిపారు. రైతు లాగిన్ అయిన వెంట‌నే త‌న‌ భూమి వివ‌రాలు క‌నిపిస్తాయన్నారు. ఎన్నిఎక‌రాల‌కు స‌ర్వే కావాలో ఫీజు చెల్లించిన త‌ర్వాత ఆ వివ‌రాలు ఆ గ్రామంలోని లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ లాగిన్‌కు వెళ్తాయని, ఏడు రోజుల్లోపు స‌ర్వే తేదీని స‌ద‌రు లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ ఖరారు చేసి రోవ‌ర్లతో స‌ర్వే పూర్తి చేస్తారన్నారు.

భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్న‌విధంగా వ్య‌వ‌సాయ భూముల‌కు సంబంధించి క్ర‌య విక్ర‌యదారుల‌కు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌ర్వే మ్యాపును జ‌త‌ప‌ర‌చే నిబంధ‌న‌ను ఈ ఐదు మండ‌లాల్లో అమ‌లు చేయనున్నారు.

దీనిని కూడా చదవండి : Ration Card Removal | రేషన్​కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
TAGGED:Bhu Bharati Portalfarmers servicesland issues solutionland records portalrevenue reformsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article ASP Office Renovation | ASP Office Renovation | ఏఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యం కోసం ఛాంబర్ పునరుద్ధరణ : ఎస్పీ రాజేష్​ చంద్ర
Next Article BJP State Executive Member | BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి కృషిచేస్తా: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: BJP State Executive Member | పార్టీ అభివృద్ధికి శాయశక్తులా..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?