అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB corruption arrests | అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. తమ వద్దకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏసీబీ (ACB) దాడులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. లంచం తీసుకోవడం కూడా ఒక విధిగా భావిస్తున్నారు. తాజాగా ఓ ఏఎస్సైతో పాటు జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ దొరికారు.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ASI) పూసాల బాలయ్యను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై ఉన్న క్రిమినల్ కేసులో సెక్షన్‌ను మార్చడానికి, దాన్ని లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ఏఎస్సై రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ACB corruption arrests | రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం..
అవినీతి అధికారులు ఉద్యోగులను కూడా వదలడం లేదు. ఓ విశ్రాంత ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, పే-బిల్ సెక్షన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. రమేష్ లంచం డిమాండ్ చేశాడు. అదే సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ తరఫున ఈ మొత్తాన్ని రమేశ్ వసూలు చేశాడు. పెన్షన్ బెనిఫిట్ ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపినందుకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి రూ.13 వేలు అడిగాడు. దీంతో బాధితురాలి కుమారుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దీనిని కూడా చదవండి : Meeseva service charges hike | మీ సేవ కేంద్రాల్లో సర్వీసు ధరల పెంపు
