అక్షరటుడే, న్యూఢిల్లీ: April 02 Pre Market Analysis | ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో భయాలను పెంచింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి.
గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగిసినా.. గురువారం ఉదయం ఫ్యూచర్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో సాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
April 02 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
ఇరాన్‌తో యుద్ధం రెండు మూడు వారాల్లో ముగియవచ్చన్న ఆశలతో గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 1.16 శాతం, ఎస్ అండ్ పీ 0.72 శాతం లాభపడ్డాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.68 శాతం నష్టంతో ఉంది.
April 02 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 2.66 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 2.06 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 1.82 శాతం లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు..
ఇరాన్‌తో యుద్ధం రెండు మూడు వారాల్లో ముగియవచ్చన్న ఆశలతో గత సెషన్‌లో భారీగా పెరిగిన మార్కెట్లు.. ట్రంప్(Trump) ప్రసంగంతో ఢీలా పడ్డాయి. ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొనడంతో ఆందోళన నెలకొంది.
క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి.
ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.68 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.61 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.97 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.78 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.35 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.16 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 2.24 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 22వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 8,331 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు వరుసగా 24వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 7,171 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.92 నుంచి 0.83 కి తగ్గింది.
- విక్స్ 3.02 శాతం తగ్గి 24.87 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.77 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 5.14 శాతం పెరిగి, 106.3 డాలర్ల వద్ద ఉంది.
