అక్షరటుడే, హైదరాబాద్: April 02 Gold Rates | గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి Silver వైపు మళ్లిస్తున్నాయి.
దీంతో దేశీయ మార్కెట్లో కూడా ఈ రెండు లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,960గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,210 వద్ద ఉంది.
April 02 Gold Rates | మళ్లీ పెరుగుతున్న ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,110కు చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,360గా ఉంది. చెన్నైలో ఈ ధరలు మరింతగా ఉండటం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులతో కనిపిస్తున్నాయి.
హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,52,960గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,210గా కొనసాగుతోంది. చెన్నైలో మాత్రం 24 క్యారెట్ల బంగారం రూ.1,53,280కు చేరుకుంది.
April 02 Gold Rates | వెండి ధరలు కూడా
మరోవైపు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వెండి కిలో ధర రూ.2.5 లక్షల మార్క్‌ను దాటింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో Kerala వెండి ధర రూ.2,65,100గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రూ.2,55,100గా నమోదైంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో కూడా ఈ లోహాల ధరలు Rates పెరుగుదల దిశలోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
