Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష

జాతీయం

Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 2022లో జరిగిన దారుణ జంట హత్యల కేసులో కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. భార్య, ఆమె బంధువును కిరాతకంగా హత్య చేసిన భర్త, అతడి తండ్రి, సోదరుడికి మరణశిక్ష విధించింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 11:05 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Agra Double Murder Verdict

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Agra Double Murder Verdict | ఆగ్రా (Agra)లో నాలుగేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కట్టుకున్న భార్యను, ఆమె బంధువును అమానుషంగా హత్య చేసిన కేసులో భర్త గౌరవ్‌తో పాటు అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అదనంగా ముగ్గురికీ తలో లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది.

Contents
  • Agra Double Murder Verdict | క‌ల‌క‌లం రేపిన హ‌త్య‌..
    • Agra Double Murder Verdict | సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా..

ఈ దారుణ ఘటన 2022 మే 27న ఏత్మాద్‌పూర్ (Etmadpur) ప్రాంతంలో చోటుచేసుకుంది. గౌరవ్ అనే వ్యక్తి తన భార్య పూజకు, ఆమె బంధువైన శివం సిసోడియాకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు. శివం, పూజను కలిసేందుకు వారి ఇంటికి రావడంతో అతడు మరింత కోపానికి గురయ్యాడు

Agra Double Murder Verdict | క‌ల‌క‌లం రేపిన హ‌త్య‌..

వారిద్దరినీ కలిసి చూసిన గౌరవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గౌరవ్, అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్ కలిసి పూజ, శివంను ఇంటి బయటకు లాక్కొచ్చి ప్రజల మధ్య దాడి చేశారు. మొదట కర్రలతో తీవ్రంగా కొట్టి, అనంతరం కిందపడిన వారిపై గొడ్డలి వంటి పదునైన ఆయుధాలతో దాడి చేసి ఇద్దరి గొంతులు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య అనంతరం గౌరవ్ తండ్రి, సోదరుడు పోలీసులకు లొంగిపోగా, పోలీసులు ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు మొత్తం 14 మంది సాక్షులను విచారించింది.

Agra Double Murder Verdict | సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా..

ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) కీలక ఆధారంగా నిలిచింది. అదేవిధంగా మృతుడు శివం సోదరుడి సాక్ష్యం కూడా కేసును బలపరిచింది. అన్ని ఆధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ముగ్గురినీ దోషులుగా తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో గౌరవ్ తల్లిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు వెలువడిన సమయంలో దోషులు ఎలాంటి భావోద్వేగం ప్రదర్శించకపోవడం గమనార్హం. ఇక ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని దోషుల తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి..: Assam Uniform Civil Code | ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
April Bank Holidays | ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
Maoists Surrender Odisha | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. 11 మంది సరెండర్
Allahabad High Court | మరో మహిళతో సహజీవనం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
TAGGED:AgraAgra Double Murder VerdictAgra newsbrutal killing caseCCTV footagedeath sentence IndiaEtmadpurIndian court verdictUttar Pradesh crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article US Iran Conflict US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి
Next Article Rotten Meat Racket Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?