Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

తాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

Rotten Meat Racket | హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లో భయానక కల్తీ దందా బయటపడింది. మంగళహాట్ ప్రాంతంలో 14 వేల కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 11:11 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Rotten Meat Racket

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rotten Meat Racket | హైద‌రాబాద్ (Hyderabad) నగరంలో కల్తీ ఆహార దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. మంగ‌ల్‌హాట్ పోలీస్ స్టేషన్ (Mangalhat Police Station) పరిధిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 14 వేల కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Contents
  • Rotten Meat Racket | అధికారులు షాక్‌
    • Rotten Meat Racket | కుళ్లిన మాంసం స‌ర‌ఫ‌రా..

Rotten Meat Racket | అధికారులు షాక్‌

హెచ్​ ఫాస్ట్ టీమ్, జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers), మంగళహాట్ పోలీసులు, గోల్కొండ టాస్క్ ఫోర్స్ (Golkonda Task Force) కలిసి బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ గోదాంలో భారీగా నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. అక్కడి పరిస్థితులు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. దుర్వాసన భరించలేక మాస్కులు ధరించి తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది. తనిఖీల్లో భాగంగా సంచులు, డబ్బాలు తెరిచి పరిశీలించగా, ఎటు చూసినా కుళ్లిన మాంసం కనిపించింది. మొత్తం సుమారు 14 వేల కిలోల మాంసం నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

Rotten Meat Racket | కుళ్లిన మాంసం స‌ర‌ఫ‌రా..

ఈ మాంసం వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి మహమ్మద్ అఫ్రోజ్ గా గుర్తించారు. ఇతడు ఆర్‌కే పేట్ చిస్తీ చమాన్ ప్రాంతంలో ‘ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్స్ ఆఫల్స్’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చనిపోయిన, కుళ్లిన మాంసాన్ని తక్కువ ధరకు సేకరించి నగరానికి తెప్పించేవాడు.అదేవిధంగా నగరంలోని కబేళాల్లో చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని కూడా సేకరించి కోల్డ్ స్టోరేజ్ (Cold Storage) గోదాంలో నిల్వ ఉంచేవాడు. డీప్ ఫ్రీజర్లు, కెమికల్స్ కలిపిన నీటితో మాంసాన్ని నిల్వ చేసి దుర్వాసన రాకుండా మాయచేసేవాడు. అనంతరం తాజా మాంసమని చెప్పి హోల్‌సేల్‌గా విక్రయించేవాడు.

ఈ మాంసాన్ని నగరంలోని పలు మటన్ షాపులు, ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. కిలో ధర రూ.500 కంటే తక్కువగా ఉండటంతో వ్యాపారం విస్తరించినట్లు తెలుస్తోంది.గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే వ్యాపారి గోదాంలో గతంలో కూడా కుళ్లిన మాంసం పట్టుబడింది. మార్చి 12న సుమారు 300 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేసి జరిమానా విధించారు. అయినప్పటికీ అతడు తన అక్రమాలను కొనసాగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు తనిఖీకి వచ్చిన సమయంలో ప్రధాన నిందితుడు పరారయ్యాడు. షాపులో ఉన్న మరో వ్యక్తి మాత్రం నిర్లక్ష్యంగా స్పందిస్తూ “శాంపిల్స్ తీసుకెళ్లండి, జరిమానా వేసుకోండి” అంటూ మాట్లాడటం మరింత సంచలనం సృష్టించింది.

ఇది కూడా చదవండి..: Hyderabad traffic restrictions | హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్​ ఆంక్షలు

 

Encroachment Removal Orders | ఆక్రమణలు తొలగించాలి.. హైడ్రా కమిషనర్​ ఆదేశం
Telangana BJP Executive | శాశ్వత ఆహ్వానితులుగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు
Global Stock Markets | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు..
Hyderabad Land Allotment | ఎంపీ మల్లు రవి భార్యకు రూ.8 కోట్లు విలువ చేసే భూమి ధారాదత్తం!
Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు
TAGGED:Cold Storageffake meat scamFood safety IndiaGHMC OfficersGHMC raidsGolkonda Task ForceHyderabad crimeHyderabad newsHyderabad Rotten Meat RacketMangalhat caseMangalhat Police Stationrotten meat racket
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Agra Double Murder Verdict Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష
Next Article Ramayana Teaser Ramayana Teaser | హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన రామాయ‌ణ టీజ‌ర్.. ఆక‌ట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: Kazipet Railway Division | రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి
  • పింగుబ్యాకు: Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?