అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ramayana Teaser | బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న పౌరాణిక మహాకావ్యం ‘రామాయణం’ సినిమా (‘Ramayana’ Movie) నుంచి కీలక అప్డేట్ వెలువడింది. దర్శకుడు నితీశ్ తివారీ (Director Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు.
ఇప్పటికే ఈ టీజర్‌ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రత్యేక ప్రదర్శనగా చూపించారు. టీజర్ దాదాపు 2 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగి ఉండగా, రాముడి పాత్రని ఇందులో పరిచయం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఇందులోని వీఎఫ్ఎక్స్ అద్భుతం అని చెప్పాలి.
Ramayana Teaser | అదిరిపోయిన టీజర్..
ఈ మూవీ గురించి రణబీర్ కపూర్ (Ranbir Kapoor) మాట్లాడుతూ, రాముడి పాత్ర పోషించడం తనకు ఎంతో గౌరవం అని అన్నారు. “శ్రీరాముడు కేవలం ఒక పురాణ పాత్ర కాదు, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం. ఆయన జీవితం మనకు ధైర్యం, కరుణ, నీతి నేర్పుతుంది. అలాంటి పాత్ర చేయడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ramayana Teaser | భారతీయ ఇతిహాసాన్ని మరింత గొప్పగా
ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా యశ్ నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే కౌశల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విద్యుత్జిహ్వగా వివేక్ ఒబెరాయ్, మంధరగా షీబా చద్దా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేలాది మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తుండగా, సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు అందిస్తున్నారు. ప్రపంచానికి భారతీయ ఇతిహాసాన్ని మరింత గొప్పగా చూపించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ‘రామాయణం’ టీజర్ విడుదలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. 4 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుండగా, ఈ మూవీ తొలి పార్ట్ దీపావళికి రిలీజ్ కానుంది.
ఇది కూడా చదవండి..: Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
