Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!

బిజినెస్​తాజా వార్తలు

Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో వృద్ధి నమోదయ్యింది. దీంతో షేరు ధర గత సెషన్‌లో భారీగా పెరిగింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 11:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
Ola Electric Sales Growth

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ola Electric Sales Growth | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి సంచలనంగా వచ్చిన ఓలా(Ola).. ప్రారంభంలో ప్రజల ఆదరణను పొందింది. ఒకప్పుడు మొత్తం ఈవీ స్కూటర్ల మార్కెట్‌లో ఆధిపత్యం ఈ కంపెనీదే.. అయితే కంపెనీ స్కూటర్లు తరచూ మరమ్మతులకు గురవడం, సర్వీసింగ్‌లో నిర్లక్ష్యం, విడిభాగాలు లభ్యం కాకపోవడం వంటి కారణాలతో కస్టమర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంపెనీ మార్కెట్ షేర్ తగ్గుతూ వచ్చింది.

Contents
  • Ola Electric Sales Growth | గతనెలలో పుంజుకున్న అమ్మకాలు..
    • Ola Electric Sales Growth | మిలియన్ యూనిట్ల అమ్మకాల రికార్డ్..
      • Ola Electric Sales Growth | భారీగా పెరిగిన షేరు ధర

ఇదే సమయంలో ప్రధాన ద్విచక్ర వాహన కంపెనీలూ ఈవీపై దృష్టి సారించడం, వాటి బలమైన నెట్‌వర్క్, సర్వీసింగ్ సేవల నాణ్యత కారణంగా అవి ప్రజాదరణ పొందాయి. దీంతో ఒకప్పుడు దేశంలో ఈవీ స్కూటర్ల (EV Scooters) అమ్మకాలలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఓలా.. క్రమంగా తన స్థానాన్ని కోల్పోతూ టాప్ టెన్ జాబితాలో స్థానాన్ని కోల్పోయింది.

Ola Electric Sales Growth | గతనెలలో పుంజుకున్న అమ్మకాలు..

మార్చి నెలలో ఓలా అమ్మకాలు పెరిగాయి. 10,117 రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు వాహన్ డేటా ప్రకారం తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ల (Ola Electric Registrations) సంఖ్య 3,973 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రెండున్నర రెట్లు వృద్ధి నమోదు కావడం గమనార్హం. మార్చి నెల చివరి వారంలో రోజుకు సగటున వెయ్యి యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. సర్వీసు సెంటర్లను విస్తరించడం, పనితీరును మెరుగుపరచుకోవడం, సర్వీసింగ్‌కు వచ్చే వాహనాల్లో దాదాపు 80 శాతం అదే రోజు పూర్తి చేసి ఇవ్వడంతో కస్టమర్ల ఆదరణ పెరిగినట్లు చెబుతోంది. ఈ రికవరీ మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.

Ola Electric Sales Growth | మిలియన్ యూనిట్ల అమ్మకాల రికార్డ్..

ఈ క్రమంలో భారతదేశంలో మొత్తం 10 లక్షల క్యుములేటివ్ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటిన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ (Electric vehicle) బ్రాండ్‌గా ఓలా రికార్డు సృష్టించింది.
మొత్తంగా 1 మిలియన్ విక్రయాలు సాధించిన తొలి ఈవీ కంపెనీగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇదే పనితీరును భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

Ola Electric Sales Growth | భారీగా పెరిగిన షేరు ధర

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో వృద్ధి నమోదు కావడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. గత సెషన్‌లో 13.55 శాతం పెరిగి రూ. 25.89 వద్ద స్థిరపడ్డాయి. గత ఏడు నెలల్లో ఓలా స్టాక్‌లో ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదల. ప్రస్తుత పెరుగుదల కొంత ఊరటనిచ్చినప్పటికీ.. 52 వారాల గరిష్ట స్థాయితో పోలిస్తే ఈ స్టాక్ ఇంకా చాలా వెనకబడే ఉంది. అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో ఈ స్టాక్ ఏకంగా 60 శాతం వరకు క్షీణించింది. ఒకానొక దశలో రూ. 22.25 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. ఓలా షేర్ ఆల్ టైమ్ గరిష్ట ధర రూ. 157.40 కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?

 

Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Kospi Market Crash | కుప్పకూలిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్
Parental Care Bill | ‘తల్లిదండ్రుల సంరక్షణ చట్టం’ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సీఎం రేవంత్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
LPG Shortage Impact | చమురు మంట.. మొబైల్​, ఇంటర్నెట్​పై ఎఫెక్ట్​ పడనుందా!
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
TAGGED:Electric vehicleelectric vehicle marketEV growth IndiaEV scooter sales IndiaIndian Stock MarketOla ElectricOla Electric RegistrationsOla Electric Sales GrowthOla share pricescooter sales news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kazipet Railway Division Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి : కేటీఆర్​
Next Article India Car Sales Growth India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?