అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Hanuman Jayanti Temples | హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా గురువారం ఉమ్మడిజిల్లాలోని(Hanuman Jayanti) హనుమాన్ ఆలయాలు భక్తిపారవశ్యంలో పులకించిపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తులు సందడి నెలకొంది.
Hanuman Jayanti Temples | సారంగపూర్‌లో ఆలయంలో ప్రత్యేక పూజలు..
నిజామాబాద్ జిల్లాలోని ముఖ్యమైన ఆలయాల్లో ఒకటైన సారంగపూర్ హనుమాన్ (Sarangapur Hanuman Temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. 400ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం జిల్లాలోనే పురాతనమైనదిగా (Nizamabad) చెప్పుకుంటారు. ఛత్రపతి శివాజీ గురువైన సమర్ధరామదాసు ఈ ఆలయానికి పునాది వేశారని భక్తులు పేర్కొంటారు. హనుమత్ జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి.
Hanuman Jayanti Temples | గోల్హనుమాన్ ఆలయంలో..
నగరం నడిబొడ్డున ఉన్న గోల్హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచే భక్తుల(Hanuman temples India) సందడి నెలకొంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామి దక్షిణముఖంగా (Hindu festivals) స్వయంభూగా వెలిశారు. అలాగే ఆర్మూర్‌లోని జంబి హనుమాన్ ఆలయం, మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో..
కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని(Telangana news) ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. అలాగే విద్యానగర్ సాయిబాబా ఆలయంలోని హనుమాన్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

సారంగపూర్ హనుమాన్ ఆలయంలో భక్తుల సందడి..

భక్తులకు మహా ప్రసాదం అందజేస్తున్న మార్వాడి యువమంచ్ సభ్యులు

కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో హనుమాన్ ఆలయంలో భక్తుల సందడి

హనుమాన్ విగ్రహానికి మొక్కులు
ఇది కూడా చదవండి:
