అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fertilizer Import Duty Removal | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల కంపెనీలకు ఉపశమనం కలిగించేలా.. అమ్మోనియం నైట్రేట్‌పై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది.
ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో ఎరువుల సరఫరాలో అంతరాయం నెలకొన్న విషయం తెలిసింది. ఇప్పటికే ముడి చమురు, గ్యాస్ కొరత (Gas Shortage)తో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో భారత్‌పై సైతం తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. తాజాగా అమ్మోనియం నైట్రెట్తో పాటు పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.
Fertilizer Import Duty Removal | ఆ పరిశ్రమలకు ఊరట
యుద్ధంతో ఎరువుల కొరత నెలకొనే అవకాశం ఉంది. వానాకాలం పంటల సీజన్‌కు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. ఎరువుల ధరలు (Fertilizer Prices) పెరగకుండా ముడి పదార్థాలపై దిగునమతి సుంకాలను సున్నాకు తగ్గించింది. దీంతో ఎరువులు రసాయన పరిశ్రమలకు ఊరట లభించనుంది. యుద్ధాలు, సరఫరా కొరత కారణంగా వ్యయ ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Fertilizer Import Duty Removal | ఒత్తిడి తగ్గించడానికి..
40 రకాల పెట్రోకెమికల్ ముడి పదార్థాలు, ఇంటర్మీడియట్‌లపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో అమ్మోనియం నైట్రేట్, మెథనాల్, ఫినాల్, పీవీసీ, పాలీప్రొపిలీన్ వంటి రసాయనాలు ఉన్నాయి. దేశీయ పరిశ్రమకు కీలకమైన పెట్రోకెమికల్ ముడిసరుకుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి, డౌన్‌స్ట్రీమ్ రంగాలపై వ్యయ ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇది కూడా చదవండి..: Agra Double Murder Verdict | ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష
