అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Hanuman Yatra | నగరంలోని వీర హనుమాన్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంఠేశ్వర్ ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Hanuman Yatra | తరలివచ్చిన భక్తులు..
నగరంలో విశ్వహిందూ పరిషత్ హిందూ సమ్మేళనం, బజరంగ్దళ్ హనుమాన్ దీక్ష (Bajrang Dal Hanuman Deeksha) సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శోభాయాత్రకు భక్తులు తరలివచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ భక్తులు సమయానికి ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా.. ర్యాలీలో భక్తులకు ఇబ్బందులు కలుగుకుండా పలుచోట్ల తాగునీటి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Hanuman Yatra | 1300మందితో పట్టిష్టమైన భద్రత
హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra)ను శాంతియుతంగా జరిగేందుకు 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర దారిపొడవునా అడుగడుగునా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది, టీఎస్ఎస్పీ బెటాలియన్ పోలీసులు, 20 స్పెషల్ పార్టీ పోలీసులతో యాత్రకు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hanuman Jayanti | ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి: ఎమ్మెల్యే ధన్పాల్

