Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట

తెలంగాణతాజా వార్తలు

Musi Project NGT Relief | ఎన్​జీటీలో ప్రభుత్వానికి ఊరట

మూసీ ప్రాజెక్ట్​ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. పట్లోళ్ల కార్తీక్​రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను ఎన్​జీటీ కొట్టివేసింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 1:34 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Musi Project NGT Relief

అక్షరటుడే, వెబ్​డెస్క్: Musi Project NGT Relief | మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యూనల్​ (NGT)లో ఊరట లభించింది. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​ ఎన్​జీటీ కొట్టివేసింది.

Contents
  • Musi Project NGT Relief | తొలిగిన అడ్డంకి
    • Musi Project NGT Relief | సీఎం విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం (State Government) మూసీ ప్రాజెక్ట్​, గాంధీ సరోవర్​ ప్రాజెక్ట్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ సుందరీకరణ చేసి తీరుతామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గతంలో పలుమార్లు ప్రకటించారు. అయితే మూసీ ప్రాజెక్ట్​తో ఎంతో మంది ఇళ్లు కోల్పోతున్నారని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్​ను సవాల్ చేస్తూ బీఆర్​ఎస్​ నాయకుడు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్​రెడ్డి ఎన్​జీటీని ఆశ్రయించారు.

Musi Project NGT Relief | తొలిగిన అడ్డంకి

మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు (CM Revanth Reddy)లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తీక్​ రెడ్డి పిటిషన్​ వేశారు. విచారణ చేపట్టిన ట్రిబ్యూనల్ ఆ పిటిషన్​ను డిస్మిస్​ చేసింది. దీంతో మూసీ ప్రాజెక్ట్​కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. పిటిషనర్​ సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. అనుమానాలతో ప్రాజెక్ట్​ను అడ్డుకోలేమని స్పష్టం చేసింది.

Musi Project NGT Relief | సీఎం విమర్శలు

ఎన్​జీటీలో కార్తీక్​రెడ్డి పిటిషన్​ వేయడంపై సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ (Omkareshwara Temple) నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజలు ఆమె కుటుంబానికి ఎంతో ఇచ్చారని, కానీ ఆమె కుమారుడు మూసీ సుందరీకరణకు అడ్డుకోవడానికి పిటిషన్ వేశారన్నారు. ఆ పిటిషన్​ను వెనక్కి తీసుకోకపోతే ఆమె కుటుంబాన్ని ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారన్నారు. తాజాగా ట్రిబ్యూనల్ ఆ పిటిషన్​ డిస్మిస్​ చేయడంతో ప్రభుత్వం పనులు చేపట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్​ ఏర్పాటు చేయాలి : కేటీఆర్​

Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Numerology Radix Numbers | ఈ తేదీల్లో పుట్టిన వారు యమ డేంజర్.. వీరి అహం దెబ్బతింటే జీవితాంతం దూరం పెట్టడం ఖాయం!
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
TAGGED:CM Revanth ReddyMusi Project NGT ReliefOmkareshwara TempleState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article LDF Manifesto  LDF Manifesto | ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్​ : కేరళం సీఎం విజయన్​
Next Article Hyderabad Mosquito Menace Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?