అక్షరటుడే, మాక్లూర్: Village Development | గ్రామాలు బాగుపడినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలంగాణ రాష్ట్ర రైతు కమిటీ సభ్యులు గడుగు గంగాధర్ (Gadugu Gangadhar) అన్నారు. గాంధీజీ కళలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన వివరించారు.
Village Development | గ్రామాభివృద్ధిపై రేవంత్రెడ్డి ప్రత్యేకశ్రద్ధ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గడుగు గంగాధర్ అన్నారు. ప్రజా పాలన-ప్రగతి నివేదన భాగంలో గురువారం మామిడిపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని గాలికివదిలేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు బోనస్, భరోసా, ఉచిత కరెంటు, రుణమాఫీ లతో పాటు మహిళా సాధికరిత కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. 99రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను సమగ్రంగా పొందుపర్చాలని సూచించారు. అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బ్రహ్మానందం, సర్పంచ్ లత తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hanuman Jayanti Temples | ఆలయాల్లో మారుమోగుతున్న జైహనుమాన్ నామస్మరణ..
