అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sarvai Papanna Goud | సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో (Sarvai Papanna Goud) ముందుకెళ్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. జిల్లా వెనుకబడిన (BC welfare) తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (tribute event) గురువారం సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా వినాయక్‌నగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Sarvai Papanna Goud | పోరాటయోధుడు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోరాట యోధుడు పాపన్నగౌడ్ వర్ధంతిని ప్రభుత్వం (Indian freedom fighters) అధికారికంగా నిర్వహిస్తోందని వివరించారు. అన్యాయాన్ని ఎదురించేందుకు పాపన్న గౌడ్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం (Telangana news) అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారి సుజయ్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్సా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: I-PAC ED Raids | ‘ఐప్యాక్’ కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
