అక్షరటుడే, వెబ్‌డెస్క్: Huzurabad Dumping Yard | తాను బతికుండగా నియోజకవర్గంలోని సిర్సపల్లిలో డంపింగ్‌యార్డు (Dumping Yard) పెట్టనివ్వనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఎంతటి పోరాటానికి సిద్ధమని, ప్రభుత్వ వెంటనే డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్‌లోని సిర్సపల్లి (Sirsapalli) సమీపంలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మహిళలు పిల్లలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ప్రజలు డంపింగ్ యార్డ్ వద్దని కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి డంపింగ్ యార్డ్ వద్దని, హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని దండం పెట్టి చెప్పానని తెలిపారు.

Huzurabad Dumping Yard | నన్ను ఉరితీయండి
‘నాపై కోపం ఉంటే ఉరి తీయండి.. జైలుకు పంపండి..’’ కానీ తన నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) కోరారు. స్వయంగా ముఖ్యమంత్రి డంపింగ్ యార్డ్‌ను ప్రతిపాదించారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాను ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు లేఖ రాశానని చెప్పారు.
Huzurabad Dumping Yard | దీక్ష చేస్తా
డంపింగ్ యార్డ్ హుజురాబాద్ ప్రజలందరి జీవన్మరణ సమస్య అని ఎమ్మెల్యే అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే తాను ఈ నెల 7, 8 తేదీలలో స్వయంగా జేఏసీ శిబిరంలో దీక్షలో పాల్గొంటానని తెలిపారు. ఆ లోపే ప్రభుత్వం నుండి అనుకూలమైన ప్రకటన వస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా ఈ నెల 3న హుజురాబాద్ బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అత్యవసర సేవలైన ఆస్పత్రులు, మెడికల్ షాపులు తప్ప మిగతావి అన్ని బంద్ పాటించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Mosquito Menace | హైదరాబాద్‌లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
