Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 2, 2026 3:53 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Palle Pragathi Participation

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Palle Pragathi Participation | పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) పిలుపునిచ్చారు. మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు.

Contents
  • Palle Pragathi Participation | సమస్యల కోసం ఫిర్యాదుల బాక్స్​ ఏర్పాటు..
    • Palle Pragathi Participation | ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా..
      • Palle Pragathi Participation | పథకాలు గురించి వివరణ..

Palle Pragathi Participation | సమస్యల కోసం ఫిర్యాదుల బాక్స్​ ఏర్పాటు..

ఈ సందర్భంగా కలెక్టర్​ ముందుగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా గ్రామ సభ వేదిక వద్ద ఫిర్యాదుల బాక్సును అందుబాటులో ఉంచారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను గ్రామ సభలో ఒక్కో పథకం వారీగా అధికారులు పేర్లను ప్రకటించారు. పంట రుణాల మాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహ జ్యోతి, చేయూత పథకం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు తదితర వాటి ద్వారా గ్రామంలో లబ్ది పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి గ్రామసభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Palle Pragathi Participation | ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా..

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)  అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు, మున్ముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు కలెక్టర్​ తెలియజేశారు. రాష్ట్ర ప్రగతి, సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి, గ్రామ సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని తెలిపారు.

Palle Pragathi Participation | పథకాలు గురించి వివరణ..

ప్రభుత్వం రైతు భరోసా పథకం (Rythu Bharosa Scheme), ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్​ పేర్కొన్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తేవాలని సూచించారు. అక్రమాలకు ఆస్కారం కల్పించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా అర్హులైన వారు మిగిలి ఉంటే, ఆయా పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా తొలివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తుది దశకు చేరాయని, త్వరలోనే ప్రభుత్వం రెండవ విడత కింద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. గ్రామ సభలో మోస్రా సర్పంచ్ శ్రీకాంత్, మండల ప్రత్యేక అధికారి రతన్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి శ్రవణ్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Village Development Goal | గ్రామాలను అభివృద్ధే చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Gas Cylinder Shortage | నగరంలో గ్యాస్​ కోసం వినియోగదారుల ఆందోళన
DCC Executive Meeting | డీసీసీ కార్పొరేషన్​ కార్యవర్గ సభ్యులు బాధ్యతతో వ్యవహరించాలి
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
Hanuman Jayanti | ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి: ఎమ్మెల్యే ధన్​పాల్
TAGGED:Collector Ila TripathiIndiramma HousesMahalaxmi SchemePalle Pragathi ParticipationRythu Bharosa SchemeState GovernmentTelangana Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Huzurabad Dumping Yard Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి
Next Article Raghav Chadha MP Raghav Chadha MP | ఎంపీ రాఘవ్‌ చద్దాకు షాక్​ ఇచ్చిన ఆమ్​ ఆద్మీ పార్టీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?