Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

నిజామాబాద్

Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ప్రజా పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం ఆయన ప్రజాపాలన-99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దోమకొండలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 2, 2026 4:14 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Praja Palana Development |
Praja Palana Development | ప్రజాపాలనలో వేగంగా అభివృద్ధి: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Praja Palana Development | ప్రజా పాలనలో రాష్ట్రం వేగంగా (Praja Palana) అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం దోమకొండలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు.

Contents
  • Praja Palana Development | సీసీరోడ్లు, డ్రెయిన్​ పనులకు శంకుస్థాపన..
    • Praja Palana Development |ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలన

Praja Palana Development | సీసీరోడ్లు, డ్రెయిన్​ పనులకు శంకుస్థాపన..

గ్రామంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్స్ (rural development) ఇతర పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామసభలో భాగంగా గ్రామస్థులు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధి, (Telangana development)మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య సేవల మెరుగుదల, రహదారుల నిర్మాణం వంటి పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, 99 రోజుల ప్రణాళిక (infrastructure projects) ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి (Congress government) ఫలితాలు కనిపిస్తాయన్నారు. దోమకొండ మండలంపై (local governance) ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, భిక్కనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాత రాజు, మాజీ జడ్పీటీసీ తిరుమల గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Praja Palana Development |ప్రభుత్వ ఆస్పత్రి పరిశీలన

దోమకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని షబ్బీర్ అలీ పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం 30 పడకల దోమమండ ఆస్పత్రిని 50 పడకలుగా మార్చింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులను పరామర్శించిన షబ్బీర్ అలీ వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో చర్చించారు. వైద్యుల కొరత ఉందని చెప్పడంతో ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి ముగ్గురు వైద్యులను త్వరలో నియమిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి

Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం
Road Safety Rules | వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: సీపీ సాయిచైతన్య
Devotion and Service | ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలి..: పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​
Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Kamareddy SI Retirement | ఇద్దరు ఎస్సైల పదవీ విరమణ
TAGGED:Congress Governmentinfrastructure projectslocal governancePraja Palanarural developmentShabbir AliTelangana development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Electricity Workers Protest Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ
Next Article Stock Market Recovery Stock Market Recovery | పడిలేచిన మార్కెట్లు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?