అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cooler Smell Problem | వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఎయిర్ కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, కూలర్ వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజులకే దాని నుంచి ఒక రకమైన నాచు వాసన లేదా నీచు వాసన రావడం ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ దుర్వాసనను వదిలించుకుని, చల్లని గాలితో పాటు మంచి సువాసన పొందేందుకు ఈ కింది చిట్కాలు పాటించండి.
Cooler Smell Problem | దుర్వాసన ఎందుకు వస్తుంది?
కూలర్‌లో ఉండే గడ్డి (Cooling Pads) నిరంతరం నీటితో తడవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా, నాచు పేరుకుపోతాయి. దీనివల్ల గాలితోపాటు పాటు చెడు వాసన కూడా గదిలోకి వస్తుంది. కొన్నిసార్లు ట్యాంకులో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కూడా ఇందుకు కారణం.
Cooler Smell Problem | పరిష్కార మార్గాలు:
సువాసన ద్రవాల వినియోగం: కూలర్ ట్యాంకులోని నీటిలో కొద్దిగా ‘కంఫర్ట్’ (Fabric Conditioner), షాంపూ లేదా రూమ్ ఫ్రెషనర్ కలపండి. ఒక గ్లాసు నీటిలో సగం కప్పు కంఫర్ట్ కలిపి ఆ మిశ్రమాన్ని నీటిలో పోస్తే, కూలర్ ఆన్ చేయగానే ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోతుంది. క్రిములను చంపడానికి కొద్దిగా డెటాల్ కూడా వాడవచ్చు.
వెంటిలేషన్ ముఖ్యం: చాలామంది కూలర్ వేసినప్పుడు కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తుంటారు. కానీ, కూలర్ నడుస్తున్నప్పుడు కనీసం ఒక కిటికీ అయినా తెరిచి ఉంచాలి. దీనివల్ల బయటి గాలి లోపలికి వచ్చి, గదిలో గాలి ప్రసరణ (Circulation) బాగుంటుంది. ఫలితంగా గదిలో ఉక్కపోత, చెడు వాసన దరిచేరవు.
నీటిని మారుస్తూ ఉండాలి: కూలర్ ట్యాంకులో నీటిని కనీసం రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాత నీరు నిల్వ ఉంటే అందులో సూక్ష్మజీవులు చేరి వాసన మరింత ఎక్కువవుతుంది. ట్యాంకును అప్పుడప్పుడు శుభ్రం చేయడం వల్ల తాజా గాలి లభిస్తుంది.
గడ్డిని మార్చడం: కూలర్ గడ్డి (Wood Wool/Honeycomb pads) బాగా పాతదైపోయి, నల్లగా మారినట్లయితే వెంటనే మార్చేయండి. కుళ్లిపోయిన గడ్డి నుంచి వచ్చే వాసనను ఏ ద్రవాలు కూడా ఆపలేవు. కొత్త గడ్డి వేయడం వల్ల గాలి చల్లగా రావడమే కాకుండా దుర్వాసన సమస్య కూడా తీరుతుంది.
ఇది కూడా చదవండి: Garuda Purana Signs | ప్రాణం పోయే ముందు కనిపించే వింత ఆకారాలు.. గరుడ పురాణం ఏమి చెబుతోందంటే!
