అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad suicide case | వారిద్దరు ఐదేళ్లు ప్రేమించుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తీరా పెళ్లయిన కొద్ది రోజులకే భర్త వేధింపులు మొదలు పెట్టాడు. దీంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలో చోటు చేసుకుంది.
బిహార్ (Bihar)కు చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్ (Madhya Pradesh)కు చెందిన నీరజ్ బన్సాల్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది. అనంతరం ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.
Hyderabad suicide case | భర్త వేధించడంతో..
ఇషిక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త నీరజ్ సైతం గచ్చిబౌలి (Gachibowli)లోని ఓ స్టార్టప్ కంపెనీలో పని చేస్తున్నారు. ఫిబ్రవరి 10న పాట్నాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లయిన తర్వాత నీరజ్ ఇషికను వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం కోసం వేధించడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు.
దీనిని కూడా చదవండి : Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లాలో విషాదం.. సిమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెల అనుమానాస్పద మృతి
