అక్షరటుడే, న్యూఢిల్లీ: Raja Ravi Varma Painting | ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవి వర్మ పెయింటింగ్‌కు విశేష గుర్తింపు లభించింది. ఆయన రూపొందించిన అరుదైన చిత్రం “యశోద-కృష్ణుడు” రికార్డు స్థాయిలో ధర పలికింది. ముంబయిలో నిర్వహించిన Saffronart స్ప్రింగ్ లైవ్ వేలంలో ఈ పెయింటింగ్ దాదాసే రూ.167 కోట్లకు పైగా అమ్ముడుపోయింది.
Raja Ravi Varma Painting | తల్లి-బిడ్డ అనుబంధం
రాజా రవి వర్మ అరుదైన కళాఖండాన్ని ప్రముఖ వ్యాపారవేత్త Cyrus S. Poonawalla కొనుగోలు చేసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. భారత సంప్రదాయ కళా సంపదకు ప్రతీకగా నిలిచే ఈ చిత్రంలో యశోద-కృష్ణుల తల్లి-బిడ్డ అనుబంధాన్ని అత్యంత సున్నితంగా చిత్రీకరించినట్లు కళా విశ్లేషకులు చెబుతున్నారు.
Raja Ravi Varma Painting | అంతర్జాతీయ స్థాయి డిమాండ్
ఈ భారత కళా ప్రపంచంలోనే ఒక మైలురాయిగా భావిస్తున్నారు. రవి వర్మ చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్‌ను ఈ వేలం మరోసారి నిరూపించింది. భారత పురాణ కథాంశాలను పాశ్చాత్య శైలిలో ఆవిష్కరించిన రవి వర్మ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, కళాభిమానులను ఆకర్షిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ
