Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు

అంతర్జాతీయం

Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అమెరికా సైన్యంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ ఏ.జార్జ్‌ను అకస్మాత్తుగా పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 10:17 ఉద.
Srinivas Kolluri
18 గంటలు ago
Share
Randy George Removal

అక్షరటుడే, వెబ్​డెస్క్: Randy George Removal | ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్​తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా సైన్యం (American Army)లోని అత్యున్నత స్థాయి అధికారి అయిన రాండీ ఏ.జార్జ్​ను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించింది.

Contents
  • Randy George Removal | ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల తొల‌గింపు..
    • Randy George Removal | అమెరికా–ఇరాన్  ఉద్రిక్తతల నేపథ్యంలో..

ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (US Secretary of Defense Pete Hegseth) ఆయనను తక్షణమే పదవి నుంచి వైదొలగాలని ఆదేశించినట్లు పెంటగాన్ వెల్లడించింది. అయితే ఈ తొలగింపునకు గల స్పష్టమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు. “జార్జ్ సేవలకు మేం కృతజ్ఞులం. కానీ సైన్యంలో నాయకత్వ మార్పునకు ఇదే సరైన సమయం” అని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Randy George Removal | ఇప్ప‌టికే ప‌లువురు అధికారుల తొల‌గింపు..

జార్జ్ తొలగింపుతో ఖాళీ అయిన ఆర్మీ చీఫ్ (Army Chief) పదవికి ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న క్రిస్టోఫర్ డోనాహ్యూను తాత్కాలికంగా నియమించినట్లు తెలుస్తోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, పీట్ హెగ్సెత్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైన్యంలో ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న పలువురు అధికారులను ఇప్పటికే తప్పించారు. అందులో జనరల్ జార్జ్ కూడా ఒకరుగా నిలిచారు. రాండీ ఏ. జార్జ్ 1988లో వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యారు. పదాతిదళ అధికారిగా తన సేవలను ప్రారంభించిన ఆయన, 2023 సెప్టెంబర్ 21న అమెరికన్ ఆర్మీ 41వ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Randy George Removal | అమెరికా–ఇరాన్  ఉద్రిక్తతల నేపథ్యంలో..

ఇంతకుముందు 38వ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందించిన ఆయన, గల్ఫ్ యుద్ధం, ఇరాక్, అఫ్గానిస్తాన్ (Afghanistan) వంటి ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా జో బైడెన్ (Joe Biden) అధ్యక్ష పదవీకాలంలో (2021–22) రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్​కు సీనియర్ మిలిటరీ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. ఆయన సైనిక జీవితంలో ఆపరేషన్ డెసర్ట్ షీల్డ్, డెసర్ట్ స్టార్మ్, ఇరాకీ ఫ్రీడమ్, ఎండ్యురింగ్ ఫ్రీడమ్ వంటి పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సైన్యంలో నాయకత్వ మార్పులు భవిష్యత్తులో అమెరికా వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: US Iran Conflict | అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు.. త్వరలో ఇరాన్​పై భీకర దాడులు చేస్తామని వెల్లడి

Mojtaba Khamenei Reward | మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్పండి.. రూ.92 కోట్ల బహుమతి గెలుచుకోండి.. అమెరికా సంచలన ప్రకటన
Iran Warship Sinking | నీటమునిగిన ఇరాన్​ యుద్ధనౌక.. శ్రీలంక తీరంలో ఘటన.. 100 మంది గల్లంతు..!
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Iran B1 Bridge Attack | ఇరాన్​ B1 వంతెన ధ్వంసంపై స్పందించిన ఇరాన్​.. గల్ఫ్‌లోని 8 వంతెనల ‘హిట్-లిస్ట్’ విడుదల
TAGGED:AfghanistanAmerican ArmyArmy ChiefJoe BidenRandy George RemovalUS Secretary of Defense Pete Hegseth
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Everest Insurance Scam Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్​లో ట్రెక్కింగ్​ ఇన్సూరెన్స్​ కుంభకోణం!
Next Article Nitish Kumar Reddy Nitish Kumar Reddy  | నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే కమ్‌బ్యాక్.. నా మైండ్ నిండా నెగెటివ్ ఆలోచ‌న‌లే ఉండేవంటూ కామెంట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?