అక్షరటుడే, కామారెడ్డి: Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద (Kamareddy news) స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం రాఘవపూర్ శివారులో (suspicious death) చోటుచేసుకుంది.
Suspicious Death Kamareddy | మృతుడి కుడి చేతిపై వి.చరణ్..
గ్రామశివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడన్న సమాచారంతో (Kamareddy police) పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి చూడగా మృతుడి వివరాలు తెలియరాలేదు. దాంతో మృతుడి ఫొటో పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన కుడిచేతిపై వి.చరణ్ అని పచ్చబొట్టు ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన (Telangana crime) వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే సదరు వ్యక్తి హత్యకు (police investigation) గురై ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడి చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది. అతన్ని హత్య చేసి ఉంటారన్న భావిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Badapahad bus accident | బడాపహాడ్ యాత్రికుల బస్సు బోల్తా.. 8 మందికి తీవ్ర గాయాలు
