Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran bridge attack | ఇరాన్‌పై భీకర దాడులు.. అతిపెద్ద వంతెన పేల్చివేత..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran bridge attack | ఇరాన్‌పై భీకర దాడులు.. అతిపెద్ద వంతెన పేల్చివేత..

అంతర్జాతీయం

Iran bridge attack | ఇరాన్‌పై భీకర దాడులు.. అతిపెద్ద వంతెన పేల్చివేత..

ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయిల్​ దళాలు విరుచుకుపడుతున్నాయి. అనేక కీలక లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన అతిపెద్ద వంతెన పేల్చివేశాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 10:30 ఉద.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Iran bridge attack

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Iran bridge attack | ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయిల్​ (Israel) దళాలు విరుచుకుపడుతున్నాయి. అనేక కీలక లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన అతిపెద్ద వంతెన పేల్చివేశాయి. పశ్చిమాసియాలోనే ఇది అతిపెద్ద వంతెనగా తెలుస్తోంది. కాగా. ఈ దాడిని దాడిని ఇరాన్‌ ధ్రువీకరించింది. ఇరాన్‌ పై అతి భీకర దాడులు చేస్తామని ట్రంప్‌ హెచ్చరించిన గంటల్లోనే దాడులు జరగడం గమనార్హం.

Contents
  • Iran bridge attack | మరోసారి ట్రంప్​ హెచ్చరికలు
    • Iran bridge attack | అనేక సైనిక లక్ష్యాలు ధ్వంసం
      • Iran bridge attack | వంతెనపై దాడిలో 8 మంది మృతి!

Iran bridge attack | మరోసారి ట్రంప్​ హెచ్చరికలు

ఇరాన్‌(Iran)లోని అతిపెద్ద వంతెనపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత.. అమెరికా (America) అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఇరాన్ ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్‌లో మిగిలిన లక్ష్యాలను నాశనం చేస్తాం. అమెరికా బలగాలు ఇంకా అసలు దాడులు ప్రారంభించలేదు” అని పేర్కొన్నారు. ఆ దేశంలోని మరిన్ని వంతెనలు, ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్​ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్​ ఇచ్చారు.

Iran bridge attack | అనేక సైనిక లక్ష్యాలు ధ్వంసం

నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌లోని చాలా ప్రధాన సైనిక లక్ష్యాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ అన్నారు. “ఇరాన్ కొత్త ప్రభుత్వ నాయకత్వానికి ఏం చేయాలో తెలుసు, దానిని వేగంగా చేయాలి” అని పేర్కొన్నారు.

Iran bridge attack | వంతెనపై దాడిలో 8 మంది మృతి!

టెహ్రాన్ సమీపంలోని బి1 వంతెన కూలిపోతున్న వీడియోను ట్రంప్​ షేర్​ చేశారు. “మరీ ఆలస్యం కాకముందే ఒక ఒప్పందం చేసుకోండి” అని ఇరాన్‌ను కోరుతూ ట్రంప్ (Trump) హెచ్చరిక జారీ చేసిన కొన్ని గంటలకే ఈ ఘటన జరగడం గమనార్హం. పశ్చిమ ఆసియాలోని అత్యంత ఎత్తయిన, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ వంతెన దాడుల్లో కూలిపోయింది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత కనీసం ఎనిమిది మంది పౌరులు మృతి చెందారని, మరో 95 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా తెలిపారు. ఈ దాడి “కరాజ్‌లోని బి1 వంతెన”ను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు పేర్కొంది. దాడి కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రాణనష్టం జరిగింది. అలాగే పలువురు గాయపడ్డారు.

Earlier today, the B1 Bridge on the Karaj Northern Bypass in western Tehran, Iran was targeted in a U.S. and/or Israeli strike, amidst an uptempo in joint U.S.-Israeli strike operations, announced by U.S. President Donald J. Trump last night. pic.twitter.com/Gm0NA2RZOC

— OSINTdefender (@sentdefender) April 2, 2026

ఇది కూడా చదవండి..:  Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ తొల‌గింపు

Iran US conflict | ఇరాన్​ దెబ్బకు అమెరికాకు భారీ నష్టం
Visakhapatnam Oil LPG Ships | హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. విశాఖకు వరుసగా చేరుతున్న చమురు, LPG నౌకలు
Iran Warns US | అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్​
Gift Nifty Gapdown | మార్కెట్‌లో యుద్ధభయాలు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
Mojtaba Khamenei Reward | మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్పండి.. రూ.92 కోట్ల బహుమతి గెలుచుకోండి.. అమెరికా సంచలన ప్రకటన
TAGGED:breaking world newsglobal conflict updatesIran bridge attackIsrael Iran conflictMiddle East Crisismilitary strikes newsTehran attack newsUS Iran tensions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Suspicious Death Kamareddy | Suspicious Death Kamareddy | గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.. హత్యగా అనుమానాలు..
Next Article Warangal ACB Raids Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?