అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal ACB Raids | హనుమకొండ జిల్లా (Hanumakonda District), వరంగల్ (ఆర్వో) సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. వరంగల్ రేంజ్ అధికారులు సోదాలు చేశారు. ఈ సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. లెక్కకు చూపని రూ.47,450/- నగదుతో పాటు 70 నమోదుకాని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Warangal ACB Raids | మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా..
పత్రాలు రాసిన వారి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా.. SRO-I జమాలపురం రామనరసింహారావు, SRO-II దావులూరి ఆనంద్ మధ్య అనేక వాట్సాప్ చాట్‌లు బయటపడ్డాయి. గత ఏడాది కాలంలో పత్రాలు రాసిన వారితో సుమారు రూ.42,03,125/- విలువైన ఫోన్‌పే లావాదేవీలు జరిగినట్లు తేలింది.
ఎస్ఆర్వో–1, ఎస్ఆర్వో–2ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఎస్ఆర్వో–2 దావులూరి ఆనంద్ ఇంటి నుంచి రూ.24,61,540/- నికర నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోగ్రాముల వెండి ఆభరణాలు, కపిల్ చిట్లలో రూ.30,10,000/- విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో ఇతర అవకతవకలను అధికారులు గమనించారు. అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

ఇది కూడా చదవండి..: Harish Rao fire | కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
