Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

KPHB Minor Theft Case | పీహెచ్‌బీలో కలకలం.. సారీ అని లేఖ రాసి రూ.25 లక్షల నగదు, బంగారంతో మైనర్ పరార్

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 17 ఏళ్ల బాలుడు ఇంట్లోంచి భారీగా నగదు, బంగారం తీసుకుని పరారవడం సంచలనం రేపింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 3, 2026 12:03 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
KPHB Minor Theft Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: KPHB Minor Theft Case | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally) హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)లో ఓ మైనర్ బాలుడు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 17 ఏళ్ల సిద్ధార్థ్ రెడ్డి అనే బాలుడు ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవడంతో పాటు భారీగా నగదు, బంగారం కూడా తీసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Contents
  • KPHB Minor Theft Case | ఎందుకు ఇలా చేస్తున్నాడు..
    • KPHB Minor Theft Case |భద్రతా అంశాలపై..

వివరాల ప్రకారం, సిద్ధార్థ్ రెడ్డి తన ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు 9 తులాల బంగారం, రూ.8 లక్షల నగదును తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాకుండా తన తండ్రి నాగార్జున రెడ్డికి చెందిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తం అపహరణకు గురైన ఆస్తి విలువ దాదాపు రూ.25 లక్షల వరకు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

KPHB Minor Theft Case | ఎందుకు ఇలా చేస్తున్నాడు..

ఇంట్లోంచి వెళ్లేముందు బాలుడు ఒక లేఖ (Letter)రాసిపెట్టడం ఈ ఘటనలో కీలకంగా మారింది. ‘సారీ నాన్నా’ అంటూ ప్రారంభమైన ఆ లేఖలో, తాను తీసుకెళ్లిన బైక్‌ను ఎక్కడో వదిలేస్తానని పేర్కొన్నాడు. ఈ లేఖ కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం సిద్ధార్థ్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అతడి ఆచూకీపై ఎలాంటి సమాచారం లభించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌ (KPHB Police Station)లో ఫిర్యాదు చేశారు. అయితే, బాలుడు ఇలాగే ఇంటి నుంచి వెళ్లిపోవడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా రెండు సార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి, కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కానీ ఈసారి భారీగా నగదు, బంగారం తీసుకెళ్లడం పరిస్థితిని మరింత సీరియస్‌గా మార్చింది.

KPHB Minor Theft Case |భద్రతా అంశాలపై..

తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుతో పాటు చోరీ  కేసును కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, బాలుడి కదలికలపై సమాచారం సేకరిస్తున్నారు. అలాగే అతడి స్నేహితులు, పరిచయస్తుల ద్వారా కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన కేపీహెచ్‌బీ ప్రాంతంలో భద్రతా అంశాలపై చర్చకు దారి తీసింది. బాలుడి ఆచూకీ త్వరగా లభించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటుండగా, పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad bakery raid | ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. మరో బేకరీపై పోలీసుల దాడి

Women Reservation Bill | మూడు రోజులు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ
Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం
Nizamabad DJ Issue | డీజే అనుమతి లేదని శోభాయాత్ర అడ్డగింత.. స్వయంగా వాహనం నడిపిన ఎమ్మెల్యే ధన్ పాల్!
TAGGED:breaking news Hyderabadgold theft indiaHyderabad crime newsjuvenile crime newsKPHB minor theft caseKukatpally incidentmissing boy caseTelangana police investigation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Spiritual centers development Spiritual centers development | ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి
Next Article Hema Drug Test Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?