అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: GG Hospital Fire | జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో(GGH Nizamabad) అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది.
GG Hospital Fire | జీజీహెచ్‌లోని ఫస్ట్‌ఫ్లోర్‌లో..
ఫైర్‌స్టేషన్ ఎస్ఎఫ్వో శంకర్ (Fire Station Nizamabad) తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో ఫస్ట్‌ఫ్లోర్‌లో పేషెంట్‌తో (GG hospital incident) వచ్చిన ఓ వ్యక్తి బీడీ తాగి పడేయడంతో స్మోక్ పైప్‌కు నిప్పంటుకుని (Nizamabad news) పొగ వ్యాపించింది. అది నేరుగా 6వ అంతస్తు వరకు(hospital fire) వెళ్లింది. భారీ పొగను గమనించిన వైద్యులు వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది క్షణాల్లోనే ఆస్పత్రికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి జీజీహెచ్‌కు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
GG Hospital Fire | భారీగా మెడికల్ సామగ్రి..
ఫస్ట్‌ఫ్లోర్‌లో స్మోక్ పైప్‌కు నిప్పంటుకోగా.. (fire accident India) పొగ ఏకంగా 6వ ఫ్లోర్‌కు చేరింది. ఆరోఫ్లోర్లో భారీగా మెడికల్ సామగ్రి (Telangana news) ఉంది. మంటలు అదుపులోకి రాకపోయి (safety awareness) ఉంటే మెడికల్ స్టోరేజ్ సామగ్రి సైతం కాలిపోయి ఉండేది. సకాలంలో ఫైర్‌స్టేషన్ సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు.

ఇది కూడా చదవండి: Hema Drug Test | డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ..
