Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yuvraj Apology Dhoni Kapil Dev | తండ్రి చేసిన త‌ప్పు.. ధోని, క‌పిల్ దేవ్‌ల‌కు యువ‌రాజ్ క్ష‌మాప‌ణ‌లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Yuvraj Apology Dhoni Kapil Dev | తండ్రి చేసిన త‌ప్పు.. ధోని, క‌పిల్ దేవ్‌ల‌కు యువ‌రాజ్ క్ష‌మాప‌ణ‌లు

క్రీడలు

Yuvraj Apology Dhoni Kapil Dev | తండ్రి చేసిన త‌ప్పు.. ధోని, క‌పిల్ దేవ్‌ల‌కు యువ‌రాజ్ క్ష‌మాప‌ణ‌లు

తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ధోనీ, కపిల్ దేవ్‌లకు క్షమాపణలు చెప్పడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 2:27 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
Yuvraj Apology Dhoni Kapil Dev

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Yuvraj Apology Dhoni Kapil Dev | భారత క్రికెట్ మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యల‌తో వార్తల్లో నిలిచాడు. తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, టీమిండియా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ (MS Dhoni), కపిల్ దేవ్‌ల‌కు క్షమాపణలు తెలిపారు.

Contents
  • Yuvraj Apology Dhoni Kapil Dev | వివాదాలకు కేంద్రబిందువైన యోగ్‌రాజ్ వ్యాఖ్యలు
    • Yuvraj Apology Dhoni Kapil Dev | ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

ఓ స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్ టీజర్‌లో యువరాజ్ మాట్లాడుతూ.. “నేను కపిల్ దేవ్ (Kapil Dev) గారికి, ఎంఎస్ ధోనీకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశారు. తన తండ్రి తరచూ ఇచ్చే ఇంటర్వ్యూల గురించి ప్రస్తావిస్తూ, “నాన్నా.. అది సరైంది కాదు అని చెప్పాను” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Yuvraj Apology Dhoni Kapil Dev | వివాదాలకు కేంద్రబిందువైన యోగ్‌రాజ్ వ్యాఖ్యలు

యోగ్‌రాజ్ సింగ్ గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు చేస్తూ, తన కుమారుడు కెప్టెన్ అవ్వకుండా ధోనీ అడ్డుకున్నాడని ఆరోపించారు. యువరాజ్ కెరీర్‌ను కూడా ధోనీ కారణంగా దెబ్బతిన్నదని పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే వాస్తవానికి, ధోనీ నాయకత్వంలోనే యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో అతని పాత్ర చారిత్రాత్మకంగా నిలిచింది. ఇక కపిల్ దేవ్​పై కూడా యోగ్‌రాజ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. 1980లలో తనను జట్టులోనుంచి తప్పించినందుకు కోపంతో కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానని, ఆయుధంతో ఆయన ఇంటివరకు వెళ్లానని చెప్పడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది.

Yuvraj Apology Dhoni Kapil Dev | ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తన తండ్రి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని స్పష్టంగా తెలిపారు. పెద్దల పట్ల గౌరవం చూపుతూ క్షమాపణలు చెప్పడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నారు. క్రీడా రంగంలో లెజెండ్స్‌గా నిలిచిన ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌ల‌పై వచ్చిన వివాదాల మధ్య, యువరాజ్ సింగ్ స్పందన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. వ్యక్తిగత అభిప్రాయాలకంటే గౌరవం ముఖ్యమని యువీ చెప్పకనే చెప్పాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీ, కపిల్ దేవ్, యువరాజ్ సింగ్ ముగ్గురూ దిగ్గజాలే కాగా, యోగ్‌రాజ్ చేసిన వ్యక్తిగత విమర్శల వల్ల వారి మధ్య ఉన్న గౌరవం దెబ్బతినకూడదని యువీ భావించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..: Nitish Kumar Reddy  | నితీష్ కుమార్ రెడ్డి అదిరిపోయే కమ్‌బ్యాక్.. నా మైండ్ నిండా నెగెటివ్ ఆలోచ‌న‌లే ఉండేవంటూ కామెంట్

India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!
Sanju Samson 97 | సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌పై థ్రిల్లింగ్ విజయం
West Indies Team Travel | యుద్ధం వ‌ల‌న‌ భారత్‌లో చిక్కుకున్న వెస్టిండీస్ జట్టుకి గుడ్ న్యూస్.. తొమ్మిది రోజుల తర్వాత స్వదేశానికి ప్రయాణం
Sri Lanka Defeat | ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో లంకకి ఘోర‌ అవమానం… 19 ఏళ్ల టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదో చెత్త రికార్డు
Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
TAGGED:2011 World Cupcricket controversycricket legendsIndian CricketKapil DevMS Dhonisports apologyT20 World CupYograj SinghYuvraj Apology Dhoni Kapil DevYuvraj Singh
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Raghav Chadha AAP Controversy Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా
Next Article Doddi Komarayya Jayanthi Doddi Komarayya Jayanthi | దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ముందుకెళ్లాలి: అదనపు కలెక్టర్​ కిరణ్​ కుమార్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?