అక్షరటుడే, వెబ్డెస్క్: Tamil Nadu BJP Candidates | దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) త్వరలో జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం తన తొలి జాబితా విడుదల చేసింది
Tamil Nadu BJP Candidates | 27 మంది అభ్యర్థులతో
తమినాళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly elections) సంబంధించి బీజేపీ తన 27 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఇందులో మైలాపూర్ నియోజకవర్గం (Mylapore Constituency) నుంచి తమిళిసై సౌందరరాజన్ బరిలోకి దిగనున్నారు. ఇక కోయంబత్తూరు (ఉత్తర) నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ అవినాశి (SC) నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడనున్నారు.
Tamil Nadu BJP Candidates | ఒకే దశలో తమిళనాడు ఎన్నికలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు. మొత్తం 234 మంది సభ్యులు కలిగిన ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం మే 10వ తేదీతో ముగియనుంది. కాంగ్రెస్, డీఎంకే ఆధ్వర్యంలోని ఎస్పీఏ, బీజేపీ, అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో ప్రధానంగా తలపడనున్నాయి. ఎస్పీఏలో కాంగ్రెస్, DMDK, వామపక్ష పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), ఇతర పార్టీలను భాగస్వాములుగా కలిగిన, ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కలిసి ‘సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్’ (SPA)గా బరిలోకి దిగునున్నాయి. అలాగే అధికార కూటమిని గద్దె దించాలనే లక్ష్యంతో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) నేతృత్వంలోని ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్’ (NDA) బరిలో నిలవనున్నాయి. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ (BJP), పట్టాలి మక్కల్ కచ్చి (PMK) మరియు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇక విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ సైతం తొలిసారి బరిలోకి దిగనుంది.
ఇది కూడా చదవండి..: Raghav Chadha AAP Controversy | ‘నా నోరు నొక్కితే.. మీరు గెలిచినట్లు కాదు’..: రాఘవ్ చడ్డా
