అక్షరటుడే, ఇందూరు: AI Technology in Education | నగరంలోని కాకతీయ ఇంజినీరింగ్ కళాశాల (కిట్స్) విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ జరుపుకున్నారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నాలుగో సంవత్సర విద్యార్థినులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాకతీయ కళాశాలల ఛైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ..గ్రామీణ యువతుల ఉజ్వల భవిష్యత్తు కోసమే కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కళాశాల (Kakatiya Women’s Engineering College) ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థినులు కష్టపడి చదవి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
AI Technology in Education | ఏఐ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని రాణించాలి
కాకతీయ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ రజనీకాంత్ (Kakatiya College MD Rajinikanth) మాట్లాడుతూ విద్యార్థినులు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిత్యత్లో బాగా చదవి కళాశాలకు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ సెల్వరాజ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థినుల భవిష్యత్ ఉద్యోగాల కోసం వివిధ రంగాల్లో అత్యుత్తమ శిక్షణనిచ్చామన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సాయారెడ్డి, ఎస్టేట్ మేనేజర్ నాగేశ్వర్రావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి.


ఇది కూడా చదవండి..: Shivaji Maharaj | హిందూధర్మాన్ని దశదిశలా చాటిన మహోన్నత వ్యక్తి శివాజీ మహరాజ్
