అక్షరటుడే, ఎల్లారెడ్డి: NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) విద్యార్థుల ముందుకు సాగుతున్నారు. గ్రామాలను స్వచ్ఛపర్చే కార్యక్రమాన్ని భుజాన వేసుకుని ముందుకు వెళ్తున్నారు. గ్రామీణులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ.. సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) వలకు చిక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
NSS Student Social Service | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్..
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో లక్ష్మాపూర్ గ్రామం (Laxmapur Village)లో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఏడు రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరంలో వలంటీర్లు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. శిబిరం చివరిరోజు నిర్వహించిన ముగింపు సమావేశానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో అవసరమన్నారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు (NSS Volunteers) చూపిన కృషిని ఆయన అభినందించారు.
ఇది కూడా చదవండి..: AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ
