అక్షటుడే, పెద్దకొడప్గల్: Drinking Water Shortage | ఎండలు ముదురుతున్నాయి.. తండాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మండలంలోని టీకారం తండాలో పరిధిలోని సర్దార్ తండాలో (Sardar Thanda) నీటి సమస్య ఏర్పడడంతో సర్పంచ్ స్పందించారు.
Drinking Water Shortage | మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో..
మండలంలోని టీకారం తండాలో (Teekaram Thanda) గ్రామ పంచాయతీ పరిధిలోని సర్దార్ తండాలో ప్రజలకు సర్పంచ్ రాజేందర్ ట్యాంకర్ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ తండా ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో పంట పొలాల నుంచి నీళ్ల ట్యాంక్ నింపుకొని తండావాసులకు అందిస్తున్నామన్నారు. ఐదు రోజుల నుంచి మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీళ్లు రావడం లేదని తండాలో ఉన్న బోరుబావిలో నీళ్లు అంతంత మాత్రంగా ఉన్నాయన్నారు. దీంతో జనాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారన్నారు. ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించడం ద్వారా తండావాసులకు కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. వేసవి కాలంలో తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ అధికారులు నీటి సమస్యను త్వరగా పరిష్కరించాని కోరారు.
ఇది కూడా చదవండి..: NSS Student Social Service | సామాజిక సేవే లక్ష్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ముందడుగు..
