అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలు చేయవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వైద్యుల సలహా తీసుకుంటూ.. తగిన జాగ్రత్తలు పాటిస్తే గర్భిణులు సురక్షితంగా ప్రయాణించవచ్చు. అయితే, ప్రయాణ సమయాల్లో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నిపుణుల సూచనలు పాటించడం అవసరం.
Pregnancy Travel Tips | ఆహారం , దుస్తుల ఎంపిక:
గర్భధారణ సమయంలో వాంతులు, వికారం వంటి సమస్యలు సహజం. అందుకే ప్రయాణానికి ముందు, ప్రయాణంలో తేలికగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. బిగుతుగా ఉండే దుస్తుల కంటే వదులుగా, సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం ఉత్తమం. నడవడానికి వీలుగా ఉండే ఫ్లాట్ చెప్పులను ఎంచుకోవడం వల్ల అలసట తగ్గుతుంది.
Pregnancy Travel Tips | హైడ్రేషన్ , మెడికల్ కిట్:
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడానికి వాటర్ బాటిల్‌ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే, ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, అవసరమైన మందులను ఒక బ్యాగ్‌లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఇవి వెంటనే ఉపయోగపడతాయి.
పరిశుభ్రత ముఖ్యం:
ప్రయాణాల్లో పబ్లిక్ వాష్‌రూమ్స్ వాడేటప్పుడు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. అందుకే హ్యాండ్‌వాష్ లేదా శానిటైజర్ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.
ఎవరు ప్రయాణించకూడదు?
విమాన ప్రయాణాలు: 35 వారాలు దాటిన వారు, జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవారు లేదా కవల పిల్లలు ఉన్నవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం (Pre-mature delivery) అయ్యే రిస్క్ ఉంటుంది.
కారు ప్రయాణం: కారులో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. మధ్యమధ్యలో వాహనాన్ని ఆపి కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది.
ముందస్తు జాగ్రత్తలు:
గతంలో గర్భస్రావం జరిగిన వారు, గర్భాశయ సంబంధిత సమస్యలు ఉన్నవారు, తొలి నెలల్లో బ్లీడింగ్ సమస్య ఎదుర్కొన్న వారు, ఎక్కువ వయసులో గర్భం దాల్చిన వారు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Everest Insurance Scam | 30 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకుల ప్రాణాలతో చెలగాటం.. నేపాల్‌లో ట్రెక్కింగ్ ఇన్సూరెన్స్ కుంభకోణం!
ఇది కూడా చదవండి: Oracle layoffs news | Oracleలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు.. ఉదయం నుంచే లేఆఫ్ ఈ మెయిల్స్!
