Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్

నిజామాబాద్

Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టత ఇవ్వాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కోరారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 3, 2026 7:16 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Degree College Land Issue |
Degree College Land Issue | డిగ్రీ కళాశాల భూముల అన్యాక్రాంతంపై స్పష్టతనివ్వాలి: ఎన్​ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్

అక్షరటుడే, కామారెడ్డి: Degree College Land Issue | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Government Degree College) భూముల అన్యాక్రాంతంపై స్పష్టత ఇవ్వాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని (MLA Kvr) ఎన్​ఎస్​యూఐ (NSUI protest) జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాశారు.

Contents
  • Degree College Land Issue | నా వద్ద అన్ని ఆధారాలున్నాయ్​..
    • Degree College Land Issue | డిగ్రీ కళాశాలకు సంబంధించి 26 ఎకరాల భూమిలో..
      • Degree College Land Issue | మూడు నివేదికలు వేర్వేరుగా చూస్తే..

Degree College Land Issue | నా వద్ద అన్ని ఆధారాలున్నాయ్​..

ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy news) భూముల్లో జరిగిన అవకతవకలపై ఆధారాలతో వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించకుండానే మొత్తం కళాశాల భూములకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తును కలెక్టర్ కార్యాలయంలో సమర్పించి ఎమ్మెల్యే వెళ్లిపోయారన్నారు. ఆ సమాచారాన్ని తాను తెలుసుకుని విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కమిటీ సభ్యుడిగా ఉండడం, ఆయన తండ్రి కేపీ రాజా రెడ్డి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో నాడు భూదస్త్రాలు వారి వద్దనే ఉండడం వారిపై బాధ్యతను మరింత పెంచుతున్నాయన్నారు.

Degree College Land Issue | డిగ్రీ కళాశాలకు సంబంధించి 26 ఎకరాల భూమిలో..

డిగ్రీ కళాశాలకు సంబంధించిన సుమారు 26 ఎకరాల భూమి (Telangana politics) విషయంలో లీజు, తనఖా వివరాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయన్నారు. కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు కర్షక్ విద్యా పరిషత్, అరోరా ఇంజినీరింగ్ కళాశాలకు (Aurora Engineering College) ఇచ్చిన లీజ్ డీడ్‌లో ఉన్న సర్వే నంబర్లు 194, 193/2, 196, 197, 185 మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు ఉందన్నారు. యూకో బ్యాంక్‌లో అరోరా ఇంజినీరింగ్ కాలేజీ వారు తనఖా పెట్టిన 201/3, 182/1, 201/5, 203/2, 179 సర్వే నంబర్ల విస్తీర్ణం 26.15 ఎకరాలు పూర్తిగా వేరుగా ఉన్నాయని, 2015 సంవత్సరంలో డీసీవో విచారణ నివేదికలో ఉన్న అరోరా ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 195, 192, 184, 190/3, 196 సర్వే నంబర్ల విస్తీర్ణం 26.6 ఎకరాలపై వివరాలతో సరిపోవడం లేదని పేర్కొన్నారు. మూడు విభాగాల్లో మూడు రకాల భూమి వివరాలు ఉండడంతో డిగ్రీ కళాశాల ఆస్తులు, భూములు అన్యక్రాంతం జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

Degree College Land Issue | మూడు నివేదికలు వేర్వేరుగా చూస్తే..

ఈ మూడు నివేదికలు వేర్వేరుగా చూస్తే కళాశాల భూములు 78.21 ఎకరాల భూమి (land irregularities) అరోరా ఇంజినీరింగ్ కాలేజీల పేరు మీద వివాదాస్పదంగా మారిందన్నారు. అరోరా ఇంజినీరింగ్ కాలేజీకి కేటాయించిన భూముల అసలు సర్వే నంబర్లు, విస్తీర్ణంపై పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. లీజు ఒప్పందం, బ్యాంక్ తనఖా పత్రాలను ప్రజలకు బహిర్గతం చేయాలన్నారు. 2015 నాటి డీసీవో విచారణపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే మౌనం పాటిస్తే అది ఆయనపై ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ బహిరంగ లేఖను ఎమ్మెల్యేకు మెయిల్, వాట్సాప్, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడం జరిగిందని, తన లేఖలో పేర్కొన్న అంశాలపై ఎమ్మెల్యే స్పందించి సరైన వివరాలు ఇవ్వాలని కోరారు.

 ఇది కూడా చదవండి : Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 45 ఫిర్యాదుల స్వీకరణ
Kamareddy ACB raids | బోసిపోయిన కామారెడ్డి మున్సిపాలిటీ.. ఏసీబీ దాడుల తర్వాత తగ్గిన జనసంచారం
Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
Prajavani Complaints Program | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ సాయిచైతన్య
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
TAGGED:Aurora Engineering CollegeKamareddy Government Degree CollegeKamareddy NewsMLA KVRNSUI protestTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Advocates' Bar Association | Advocates’ Bar Association | అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల నారాయణ
Next Article Gurukul Students Field Trip | Gurukul Students Field Trip | గురుకుల విద్యార్థుల ఫీల్డ్ ట్రిప్..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?