అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkar Ghat | వచ్చే ఏడాది పుష్కరాల సందర్భంగా జిల్లాలో (Bodhan updates) ఘాట్ల వద్ద (Godavari Pushkaralu) ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య తుంగిని వద్ద ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.
Godavari Pushkar Ghat | అన్ని ఏర్పాట్లు చేయాలి..
ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి ఆయా ఘాట్ల (Pushkar Ghat) వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాట్‌కు వచ్చి వెళ్లే రోడ్లకు మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేయాలని.. అలాగే గజ ఈతగాళ్లను పుష్కరాల ప్రారంభం నుంచి ముగింపు వరకు అందుబాటులో (Telangana news) ఉండేలా చూడాలన్నారు. సీపీ వెంట నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై శ్రీకాంత్, తుంగిని సర్పంచ్ కాంతారావ్, ఉపసర్పంచ్ భూమేష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు.
ఇది కూడా చదవండి: Fee Regulation | ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలి..: కవిత
