అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Sports Development | సరిపడా సౌకర్యాలు (sports development) లేనప్పటికీ క్రీడారంగంలో నిజామాబాద్ జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండడం ఎంతో గర్వించదగ్గ (Nizamabad sports) విషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ (Telangana athletes) స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. సీఎం కప్‌లో భాగంగా జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాజట్లకు కలెక్టరేట్లో ట్రోఫీలు అందజేశారు.
Nizamabad Sports Development | విశిష్ట అతిథులతో ప్రత్యేక ఆకర్షణ..
నిజామాబాద్ జిల్లా వాసులైన అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్ (Hussamuddin), భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్య(Guguloth Sowmya) ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వీరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేక మంది క్రీడాకారులు ఈ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్‌లో జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లాలో క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Nizamabad Sports Development | జిల్లావ్యాప్తంగా 31,353 మంది క్రీడాకారులు..
సీఎం కప్ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ స్థాయి (CM Cup games) నుంచి రాష్ట్ర స్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారన్నారు. 2,700 మంది జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో వివిధ అంశాలలో పాల్గొని 53 పతకాలు సాధించడం జరిగిందన్నారు. వీటిలో 12 బంగారు పతకాలు, 11 వెండి పతకాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయని, తద్వారా నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్–5 లో నిలిచిందని అభినందించారు. కోచ్‌లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అద్భుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు.
Nizamabad Sports Development | ఉద్యోగాలు.. ఉన్నత చదువులు..
ఉద్యోగ నియామకాలతో పాటు, ఉన్నత విద్యావకాశాలలోనూ స్పోర్ట్స్ కోటా కింద ప్రవేశాలు పొందవచ్చని కలెక్టర్ (district collector) అన్నారు. విద్యార్థులు (sports achievements), యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడారంగ (Indian sports news) అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని వివరించారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీవైఎస్వో పవన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.



ఇది కూడా చదవండి: Godavari Pushkar Ghat | తుంగిని పుష్కర ఘాట్‌ను సందర్శించిన సీపీ సాయిచైతన్య
