Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..

బిజినెస్​జాతీయం

PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..

మనకు ఆధార్‌ ఎంత అవసరమో.. పాన్‌ కార్డు కూడా అంతే అవసరం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో ఇది కీలకం.. దీని దరఖాస్తుకు సంబంధించిన నిబంధనలు మారాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 3, 2026 9:22 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
PAN Card Rules

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PAN Card Rules | కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటే పాన్ కార్డు నిబంధనలు కూడా చాలావరకు మారాయి. పాన్‌ దరఖాస్తు, పాత వివరాల సవరణ విధానాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరింత కఠినతరం చేసింది. ఇప్పటివరకు పాన్ కార్డు దరఖాస్తు కోసం, సవరణల కోసం వాడుతున్న పాత ఫాంలను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తవాటిని తీసుకొచ్చింది. దరఖాస్తుదారుల గుర్తింపు, ముఖ్యంగా పుట్టిన తేదీ ధ్రువీకరణ నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో కొత్త పాన్‌ దరఖాస్తుల కోసం 49ఏ, 49ఏఏ ఫారాలను ఉపయోగించేవారు. వాటిని రద్దు చేసిన సీబీడీటీ.. వాటి స్థానంలో నాలుగు కొత్త ఫాంలను ప్రవేశపెట్టింది.

Contents
  • PAN Card Rules | కొత్త పాన్‌ దరఖాస్తు పత్రాలు..
    • PAN Card Rules | పాన్‌ వివరాల సవరణకోసం..
      • ఆధార్‌ ఒక్కటే సరిపోదు..

PAN Card Rules | కొత్త పాన్‌ దరఖాస్తు పత్రాలు..

  • ఫాం 93: భారతీయ పౌరులు, ప్రవాస భారతీయులకు సంబంధించినది.
  • ఫాం 94: ట్రస్టులు, కంపెనీలు వంటి భారతీయ సంస్థలకు ఉద్దేశించినది.
  • ఫాం 95 : విదేశీ పౌరులకు సంబంధించిన ఫాం ఇది.
  • ఫాం 96: విదేశీ సంస్థలకోసం ఉద్దేశించిన ఫాం.

PAN Card Rules | పాన్‌ వివరాల సవరణకోసం..

ఆదాయపు పన్ను నిబంధనలు 2026, రూల్‌ 158(12) కింద పాన్‌ సమాచారం లేదా మార్పుల కోసం సీబీడీటీ కొత్త దరఖాస్తు ఫారాలను నోటిఫై చేసింది. దీని ‍ప్రకారం పాన్‌ కార్డు వివరాలు మార్చుకోవాలనుకునే సాధారణ వ్యక్తులు ఇకపై ‘పాన్‌ సీఆర్‌ -01’ ఫాం ఉపయోగించాల్సి ఉంటుంది. సంస్థల కోసం ‘పాన్‌ సీఆర్‌ -02’ తీసుకువచ్చారు.

సవరణ ఫాంలో దరఖాస్తుదారు పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, పాస్‌పోర్ట్‌ నంబరు, మొబైల్‌ నంబరు, తల్లిదండ్రుల పేర్లు కచ్చితంగా నమోదు చేయాలి. పాన్ కార్డుపై తల్లి లేదా తండ్రి ఎవరి పేరు ముద్రించాలో స్పష్టంగా ఎంచుకోవాలి. పాన్ కార్డు పోతే దరఖాస్తుతో ఎఫ్ఐఆర్ కాపీ తప్పనిసరి. ఫాంను ఆఫ్‌లైన్‌లో సమర్పించినప్పుడు ఆంగ్ల పెద్ద అక్షరాల్లో నలుపు రంగు సిరాతో నింపాల్సి ఉంటుంది.

ఆధార్‌ ఒక్కటే సరిపోదు..

ఇప్పటివరకు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు ఒక్కటి ఉన్నా సరిపోయేది. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం మరిన్ని పత్రాలను తప్పనిసరి చేశారు. పదో తరగతి సర్టిఫికెట్, పుట్టిన తేదీ క్లారిటీగా ఉన్న పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి జత చేయాల్సి ఉంటుంది. 2023 అక్టోబర్‌ 1 తర్వాత జన్మించినవారికి మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

ఇది కూడా చదవండి..: Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?

Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Gold Prices on Ugadi | ఉగాది రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశవ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..
ధోనీ ‘నంబర్ 8’ సీక్రెట్ రివీల్.. నిద్రలేమిపై ‘ది స్లీప్ కంపెనీ’తో కలిసి మిస్టర్ కూల్ జాతీయ ఉద్యమం!
LPG cylinder supply | ఎల్​పీజీపై కేంద్రం కీలక ప్రకటన.. రాష్ట్రాలకు అదనంగా సిలిండర్లు
Multiple Bank Accounts | ఒకే బ్యాంకులో రెండు, మూడు అకౌంట్లు ఉండొచ్చా.. ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా.. నష్టమా?
TAGGED:AadhaarCBDTFinancial RulesIncome Tax IndiaIndia FinancePAN ApplicationPAN Card RulesPAN Update
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Eye twitching Eye twitching | కన్ను అదురుతుందని కంగారు పడుతున్నారా.. ఇది దేనికి సంకేతమంటే!
Next Article Pregnancy Travel Tips Pregnancy Travel Tips | ప్రెగ్నెన్సీలో ప్రయాణాలా.. భయం వద్దు.. ఈ ‘గోల్డెన్ రూల్స్’ పాటిస్తే చాలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?