Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

భక్తి - April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం!

భక్తితాజా వార్తలు

April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ఆధారంగా ఒక వ్యక్తి రాశికి వచ్చే ఫలితాల గురించి చెప్పే అంచనాలే రాశి ఫలాలు. జననం సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో దానిని ఆధారంగా వ్యక్తికి ఒక రాశి (Zodiac Sign) ని నిర్ణయిస్తారు. ఆ రాశిపై గ్రహాల సంచార ప్రభావం ఎలా ఉందో చూసి ఫలితం ఎలా ఉండవచ్చో చెప్పే అంచనాలనే రాశి ఫలాలు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 10:36 సా.
Naresh chandan
2 రోజులు ago
Share
April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం!
April 04 Horoscope | వివాహితులకు జాక్‌పాట్.. ఈ రాశుల వారికి అత్తమామల వైపు నుంచి భారీగా ఆర్థిక ప్రయోజనం!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: April 04 Horoscope | గ్రహ గతులను పరిశీలిస్తే, కుజుడు (అంగారకుడు) ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల నేడు (శనివారం, ఏప్రిల్​ 04) పలు రాశుల వారికి పనుల్లో వేగం పెరిగినప్పటికీ, అనవసరమైన వాదనలు, తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Contents
  • April 04 Horoscope | రాశుల వారీగా..
    • April 04 Horoscope | వృషభం, మిథునం..
      • April 04 Horoscope | కర్కాటకం, సింహం..
      • April 04 Horoscope | కన్యా, తులా..
      • April 04 Horoscope | మిగతా రాశులు..

అయితే, జాతకచక్రంలో గురు గ్రహం, శని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ధన లాభం చేకూరుతుంది. కుజుడి ప్రభావంతో భూ సంబంధిత వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా.. బుధుడి స్థితి వల్ల కొత్త ఒప్పందాల విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

April 04 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: కొత్త వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత రహస్యాలను పంచుకోకండి. విదేశాల్లో ఉన్న మిత్రులు లేదా బంధువుల నుంచి కొంత నిరుత్సాహపరిచే వార్త వినే అవకాశం ఉంది.

April 04 Horoscope | వృషభం, మిథునం..

వృషభ రాశి: ఇంట్లోని పిల్లలు లేదా వృద్ధుల ఆరోగ్య సమస్యలు మీ దంపతుల మధ్య కొంత ఆందోళన కలిగించవచ్చు. ఎవరినీ సంప్రదించకుండా తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఇంట్లో పెండింగులో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంటుంది. సన్నిహితుల వల్ల కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది, ఇతరులు మిమ్మల్ని ప్రశంసిస్తారు.

మిథున రాశి: ఆదాయం బాగున్నా.. అనవసర ఖర్చులు పనులకు ఆటంకం కలిగించవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో శుభకార్యాలు లేదా వేడుకలు జరిగే అవకాశం ఉంది. మీ పని నైపుణ్యం, మాట్లాడే విధానం వల్ల అందరి ప్రశంసలు అందుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం ఉత్తమం.

April 04 Horoscope | కర్కాటకం, సింహం..

కర్కాటక రాశి: ఇవాళ మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడండి. తప్పుడు నిర్ణయాలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు, ఇది ఎంతో మానసిక ప్రశాంతతను, తృప్తిని ఇస్తుంది.

సింహ రాశి: జీవితం పట్ల భరోసాతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆదాయం బాగున్నా, పెరిగిన ఖర్చుల వల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది. ఖర్చుల విషయంలో ప్లానింగ్ అవసరం. భాగస్వామి నుంచి ఒక తీపి కబురు లేదా సర్​ప్రైజ్​ అందవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

April 04 Horoscope | కన్యా, తులా..

కన్యా రాశి: సానుకూల ఆలోచనలతో ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించగలరు. మీ తెలివితేటలు ఇవాళ రక్షణగా నిలుస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టండి. ఇవాళ కొన్ని మంచి సంఘటనలు, మరికొన్ని చికాకులు కలిగించే పనులు జరగవచ్చు. దీనివల్ల కాస్త అయోమయానికి, అలసటకి గురయ్యే అవకాశం ఉంది.

తులా రాశి: సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి. వివాహితులకు తమ అత్తమామల వైపు నుంచి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. బంధువుల కోరికలు లేదా పనులు కొంత శ్రమ కలిగించినా, చివరికి అవి మేలు చేస్తాయి. ఇవాళ మీ ఆలోచనలు చాలా కొత్తగా, క్రియేటివ్‌గా ఉంటాయి. జీవితం ఆనందంగా ఉండటానికి వినాయకుడికి గరిక (గడ్డి) సమర్పించి పూజించండి.

April 04 Horoscope | మిగతా రాశులు..

వృశ్చిక రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాల్లో తండ్రి సలహాలు మంచి లాభాలను, ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ప్రేమ వ్యవహారాల్లో అదృష్టం వరిస్తుంది.

ధనుస్సు రాశి: మీ ఆకర్షణీయమైన ప్రవర్తన, మాటతీరు అందరినీ మెప్పిస్తాయి. మీలోని హాస్య చతురత చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని కలిగిస్తుంది. గ్రహగతులు అనుకూలంగా ఉండటంతో ఇవాళ అద్భుతమైన ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు.

మకర రాశి: గతంలో ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవాళ తిరిగి తికి అందుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇతరులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి, అందులోనే సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు. ఇంటి విషయాల్లో ఏదైనా మార్పు చేయాలనుకుంటే కుటుంబ సభ్యులందరి అభిప్రాయం తీసుకోండి.

కుంభ రాశి: ఇవాళ ఒక తీపి కబురు అందుతుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు, ఇవాళ చేతికి అందుతుంది. ఇది ఎంతో ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని మార్చలేని విషయాల గురించి అతిగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవద్దు.

మీన రాశి: పని ఒత్తిడి వల్ల కాస్త అలసటగా, సందిగ్ధంగా అనిపించవచ్చు. ఇవాళ ఎవరికీ అప్పు ఇవ్వకపోవడమే మంచిది. దూరపు బంధువుల నుంచి వచ్చే ఒక శుభవార్త ఇంట్లో అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్న స్నేహితులు లేదా బంధువుల నుంచి కొంత నిరుత్సాహపరిచే వార్త వినే అవకాశం ఉంది.

Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
IQOO 15R 5G | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో ఐక్యూ ఫోన్.. ఆ కార్డులతో రూ. 4 వేల వరకు తగ్గింపు
Strait of Hormuz Oil | హోర్ముజ్ జలసంధి ఉద్రిక్తతతో 110 డాలర్లకు చమురు ధర!
April 02 Horoscope | హనుమాన్​ దయ.. సన్నిహితుల ఆర్థిక చేయూత.. ఈ రాశుల వారికి ఇక రాజయోగం పక్కా!
TAGGED:April 04 Horoscope
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Macharla Rape Case Macharla Rape Case | మాచర్లలో అమానుషం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ‘దిశ’ తరహాలో రేప్​!
Next Article Chanakya Niti Chanakya Niti | కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడి ఈ మాటలు వింటే చాలు, గెలుపు మీ వెంటే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?