అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 04 Gold Rates | గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో Silver Rates భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపడంతో, పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
గత నెలలో భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు మార్చి చివరి వారంలో నుంచి తిరిగి పుంజుకోవడం ప్రారంభించాయి. ముఖ్యంగా శుక్రవారం ఒక్కరోజే తులం బంగారం ధర సుమారు రూ.2,000 వరకు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. ఇక ఏప్రిల్ 4, శనివారం నాటి ధరలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
April 04 Gold Rates | మళ్లీ పైపైకి..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,940గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,360గా నమోదైంది.
- విజయవాడలో Vijaywada 24 క్యారెట్ల ధర రూ.1,50,940గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,360గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,51,090గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,510గా ట్రేడ్ అయింది.
- ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,50,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,360గా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,51,100గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,510గా ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,50,940 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,360గా ట్రేడ్ అయింది.
- April 04 Gold Rates | స్వల్పంగా తగ్గుదల..
ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో hyderabadకిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. ఇదే ధర చెన్నై, కేరళలో కూడా నమోదైంది. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,49,900గా ట్రేడ్ అవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్నంతకాలం బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని భావిస్తున్నారు.
ముఖ్యంగా డాలర్ బలహీనత, యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణ భయాలు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. మొత్తానికి, ప్రస్తుతం బంగారం మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తుండగా, వెండి మాత్రం కొంత స్థిరత్వం కోల్పోయినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఈ ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Delhi Earthquake | హిందూకుష్‌లో భారీ భూకంపం.. ఎనిమిది మంది మృతి.. భారత్‌లోనూ ప్రకంపనలు
