Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా

క్రీడలు

Shreyas Iyer | గెలిచిన సంతోషం లేదు.. స్లో ఓవర్ రేటుతో శ్రేయస్ అయ్యర్‌కి భారీ జరిమానా

చెన్నైపై ఘన విజయం సాధించి టేబుల్ టాప్‌లోకి చేరిన పంజాబ్ కింగ్స్‌కి స్లో ఓవర్ రేటు కారణంగా ఐపీఎల్ నుంచి భారీ షాక్ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఏకంగా రూ.24 లక్షల జరిమానా విధించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 11:10 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Shreyas Iyer

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shreyas Iyer | ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మరోసారి తన సత్తా చాటింది. శుక్రవారం ఎం.ఏ. చిదంబరం స్టేడియం (M.A. Chidambaram Stadium)లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Contents
  •  Shreyas Iyer | పంజాబ్ జట్టుకు భారీ షాక్
    • Shreyas Iyer | రెండోసారి తప్పిదం… జరిమానా రెట్టింపు
      • Shreyas Iyer | పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన

 Shreyas Iyer | పంజాబ్ జట్టుకు భారీ షాక్

ఈ గెలుపుతో పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మ్యాచ్ అనంతరం ఐపీఎల్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ పంజాబ్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడం (స్లో ఓవర్ రేటు) కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కి రూ.24 లక్షల జరిమానా విధించింది.

Shreyas Iyer | రెండోసారి తప్పిదం… జరిమానా రెట్టింపు

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఇది రెండోసారి. మొదటి తప్పిదానికి అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించగా, ఇప్పుడు అదే తప్పిదం మళ్లీ పునరావృతం కావడంతో జరిమానాను రూ.24 లక్షలకు పెంచారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం కనీస ఓవర్ రేట్ ఉల్లంఘనలకు ఈ శిక్షలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ పంజాబ్ కింగ్స్ మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును కొనసాగిస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆటగాళ్లకు కూడా రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించబడుతుంది.

Shreyas Iyer | పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన

మ్యాచ్ విషయానికి వస్తే, ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది.ఆయుష్ మాత్రే – 73 (43 బంతులు), శివమ్ దూబే – 45* (27 బంతులు), స‌ర్ఫరాజ్ ఖాన్ – 32 (12 బంతులు) ప‌రుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో విజయకుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీసి రాణించగా, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ సాధించారు. అనంతరం ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. శ్రేయస్ అయ్యర్ – 50 (29 బంతులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ – 43 (34 బంతులు), ప్రియాన్ష్ ఆర్య – 39 (11 బంతులు) రాణించారు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది వరుసగా రెండో ఓటమి. తమ సొంత మైదానంలో కూడా ఓడిపోవడం జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. బౌలింగ్ విభాగంలో మాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ చెరో రెండు వికెట్లు తీసినా జట్టును గెలిపించలేకపోయారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Sports Development | క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

SRH New Captain | ఐపీఎల్ 2026లో SRHకి కొత్త కెప్టెన్.. అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిష‌న్‌ల‌లో ఒక‌రిని ఎంపిక చేసే ఛాన్స్..
India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం
Ishan Kishan SRH | SRH ప్రాక్టీస్ మ్యాచ్‌లో హీటెక్కిన సన్నివేశం.. కెప్టెన్‌నే గెటౌట్ అంటూ సైగ చేసిన యువ క్రికెట‌ర్
India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256
MS Dhoni Traffic Fine | రూల్స్ ఉల్లంఘించిన ఎంఎస్ ధోని.. ట్రాఫిక్ పోలీసులు ఎంత జ‌రిమానా విధించారంటే..!
TAGGED:Chennai Super KingsCricket NewsIPLIPL 2026IPL penaltyIPL rulesM.A. Chidambaram StadiumPunjab KingsShreyas Iyerslow over rate
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Artificial Mango Ripening Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్​ అవుతారు!
Next Article Badam Milk Incident Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?