అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Footpath Encroachment Drive | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతోంది. నగర జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. దీనికి కొందరు వ్యాపారులు పుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్లపై నడుస్తుండటంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
నగరంలో ట్రాఫిక్ సమస్య (Traffic Problem)ను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers) ఆక్రమణలపై కొరఢా ఝళిపిస్తున్నారు. ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆరాంఘర్ వద్ద ఫుట్‌పాత్ లపై ఆక్రమణలను శనివారం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు.
Footpath Encroachment Drive | బందోబస్తు మధ్య..
పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కూల్చివేతల సందర్భంగా అధికారులు, చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే రోడ్డును ఆక్రమించి డబ్బాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు చేసే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపుతామన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు.
Footpath Encroachment Drive | ఎన్నికల కోసమేనా..
జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) త్వరలో నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి. అనంతరం మిగతా విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉంటాయి. దీంతో పాఠశాలలకు సెలవులు వచ్చాక.. ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. మేలో ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నగరంలో పలు అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇటీవల నెల రోజుల పాటు జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ డ్రైవ్ చేపట్టారు. తాజాగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. మరోవైపు జలమండలి అధికారులు సైతం బస్తీల్లో పర్యటిస్తూ తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Artificial Mango Ripening | మామిడి పండ్లు కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!
