Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..

నిజామాబాద్

Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి..

విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ అధికారులు విజయ్ కుమార్, కృష్ణవేణి అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 12:51 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Financial Literacy

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Financial Literacy | విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ అధికారులు విజయ్ కుమార్, కృష్ణవేణి అన్నారు. మండలంలోని కోనాపూర్​లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School) భూషణరావుపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మక్సూద్ అలీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు.

Contents
  • Financial Literacy | తల్లిదండ్రులు సైతం..
    • Financial Literacy | సైబర్​ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి..

Financial Literacy | తల్లిదండ్రులు సైతం..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ ఆర్థిక అవసరాలపై స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తీసుకోకుండా బ్యాంకుల్లో రుణం తీసుకోవాలని తెలిపారు. బ్యాంకులు ప్రజల అవసరాలకు విద్యా రుణం, బంగారు ఆభరణాలపై, గృహ నిర్మాణం, పంటల కోసం రుణాలు ఇస్తాయన్నారు. గడువు తేదీ లోపల రుణం చెల్లిస్తే నిబంధనల మేరకు మరిన్ని అవకాశాలు ఇస్తారన్నారు. పొదుపు చేసిన, సంపాదించిన డబ్బును సేవింగ్స్ ఖాతా (Savings Account), రికరింగ్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకోవచ్చని, ప్రతి విద్యార్థి బ్యాంకులో ఖాతా తీసుకొని ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలని వివరించారు.

Financial Literacy | సైబర్​ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి..

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైబర్ నేరాలపై (Cyber Crimes) అవగాహన కలిగి ఉండాలని, తెలియని లింకుల ద్వారా వచ్చే మెసేజ్​లను ఓపెన్ చేయవద్దని, ఆన్​లైన్​ మార్కెటింగ్ విధానంలో మోసపోవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మనకు తెలిసిన వ్యక్తుల లాగా నటిస్తూ మోసం చేస్తారని, మీకు లాటరీ వచ్చిందని మోసం చేస్తారన్నారు. వ్యక్తిగత వివరాలైన డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డు పిన్ ఎవరికి చెప్పవద్దని పాస్​వర్డ్​లు తరచూ మార్చుకోవాలని తెలిపారు. బ్యాంక్ ఖాతా లేని విద్యార్థులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ భూషణరావుపేట శాఖలో ఉచితంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందజేశారు. విద్యార్థులందరికీ నోటుబుక్కులు, పెన్నులు అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Dharmapuri Sanjay Protest | డి.సంజయ్​కు పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష

 

Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్​అలీ
Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు
Godavari Pushkaralu Preparations | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Fee Poru Deeksha | 15న ఇందిరాపార్క్​ వద్ద ‘ఫీజు పోరు దీక్ష’
TAGGED:banking educationCyber Crimescyber safetyFinancial Literacyindia educationpersonal financeRBI awarenesssavings accountsavings habitsstudents savingsZilla Parishad High School
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dharmapuri Sanjay Protest Dharmapuri Sanjay Protest | ధర్మపురి సంజయ్​కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష
Next Article Drunk Driving WhatsApp Group Drunk Driving WhatsApp Group | మందుబాబుల మాస్టర్​ ప్లాన్​.. షాకిచ్చిన ఎస్సై
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?