Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Family Suicide Attempt | కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ -  Family Suicide Attempt | కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్​

 Family Suicide Attempt | కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 2:26 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Muskmelon
Muskmelon

అక్షరటుడే, వెబ్​డెస్క్: Family Suicide Attempt | ఓ వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కుటుంబంతో కలిసి తనువు చాలించాలని సిద్ధం అయ్యాడు. అయితే ఆ విషయం పోలీసులకు తెలియడంతో అతడి కుటుంబాన్ని కాపాడారు.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లో చోటు చేసుకుంది.పల్నాడు జిల్లా దుర్గి మండల (Durgi Mandal) కేంద్రానికి చెందిన శ్రీపతి అమరేంద్ర, త్రివేణి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో అమరేంద్ర చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని భార్యను ఒప్పించాడు. అనంతరం స్నేహితుడి వద్ద కారు తీసుకొని దానిలో కుటుంబాన్ని ఎక్కించుకొని బయలుదేరాడు. అయితే తాము ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్న విషయాన్ని త్రివేణి తన మామకు ఫోన్​ చేసి చెప్పింది. ఆయన వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 Family Suicide Attempt | ట్రేస్​ చేసి..

సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారు కోసం గాలించారు. సంతమాగులూరు (Santhamaguluru) నుంచి నరసరావుపేట వైపు వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. గుంటూరు రోడ్డులోని డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో వారి కారును గుర్తించారు. అనంతరం దంపతులను ప్రశ్నించగా.. తాము ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లడం లేదని వారు బుకాయించారు. అయితే పోలీసులు కౌన్సెలింగ్​ ఇవ్వడంతో తాము ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినట్లు అంగీకారించారు. వారికి పోలీసులు సర్ది చెప్పి ఇంటికి పంపించారు.

ఇది కూడా చదవండి..: Badam Milk Incident | జాతరలో విక‌టించిన బాదం పాలు.. 80 మందికి అస్వస్థత, ఆసుపత్రుల్లో చికిత్స

Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
Jana Sena MLA | జనసేన ఎమ్మెల్యేపై మనీ లాండరింగ్ ఆరోపణలు
Visakhapatnam Murder Case | విశాఖలో దారుణం.. ప్రియురాలిని చంపి.. ముక్కలుగా చేసి.. ఫ్రిడ్జ్​లో దాచి!
Goods Train Derailment | పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
TAGGED:Andhra PradeshAndhra Pradesh Newsbreaking news Indiacrime newsdebt issuesDurgi Mandalfamily crisisFamily Suicide Attemptmental health awarenesspolice rescueSanthamaguluru
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paddy Procurement Farmers Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
Next Article Siddhartha College Farewell Siddhartha College Farewell | సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఫేర్‌వెల్ డే’
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?