Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paddy Procurement Supplies | గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పోచారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Paddy Procurement Supplies | గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పోచారం

నిజామాబాద్

Paddy Procurement Supplies | గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే పోచారం

కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు, సొసైటీ పాలకవర్గ సభ్యులకు సూచించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 4, 2026 3:47 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Paddy Procurement Supplies

అక్షరటుడే, కోటగిరి : Paddy Procurement Supplies | కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, లారీల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ (Banswada) నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అధికారులకు, సొసైటీ పాలకవర్గ సభ్యులకు సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార పరపతి సంఘంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో కలిసి శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Contents
  • Paddy Procurement Supplies | వెనువెంటనే కాంటాలు వేయాలి..
    • Paddy Procurement Supplies | ఇసుకకు ఇబ్బందిగా ఉంది..

Paddy Procurement Supplies | వెనువెంటనే కాంటాలు వేయాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ఎండిన ధాన్యాన్ని వెనువెంటనే కాంటాలు చేయాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ రకం రూ.2,389 కామన్ గ్రేడ్ రకం రూ.2,369 ఉంటుందన్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నా కూడా రైతులు ధైర్యంగా భగవంతుడి మీద నమ్మకంతో ధాన్యాన్ని కోసి ఆరబెట్టారన్నారు. చుట్టుపక్కల వర్షాలు ఉన్నా మన దగ్గర పడలేదన్నారు. ముందు చూపుతో 45వేల బస్తాలు వచ్చాయన్నారు. ఎక్కడా కూడా గోనెసంచులు, లారీల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. రాత్రి అయినా సరే లారీలు తీసుకొని వచ్చి కాంటలు చేయించాలని సెక్రెటరీ, సహకార సంఘం సిబ్బందికి సూచించారు.

Paddy Procurement Supplies | ఇసుకకు ఇబ్బందిగా ఉంది..

ఈ సందర్భంగా గ్రామస్థులు యాప్​లో ఇసుకను బుక్​ చేసుకుంటే కావట్లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఇసుక అవసరం ఉన్నవారు ప్రాక్టెడ్ ద్వారా ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందజేసే బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ… రైతులు వరి పండించడంలో రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం ముందుందన్నారు. రైతుల అకౌంట్లో బోనస్ డబ్బులు పడ్డాయని రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్ హన్మంత్, సర్పంచ్, కల్లూరి సంధ్య హన్మాండ్లు, ఎంపీడీవో చందర్, ఆర్​ఐ సయ్యద్ హుస్సేన్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు షాజీ పటేల్, పీఏసీ ఇన్​ఛార్జి ఛైర్మన్​ రియాజుద్దీన్, ఏవో నిషిత, సర్పంచులు, శ్రీనివాస్ రావు, జగన్, రామ్ రెడ్డి, భాస్కర్, రైతులు, గంధపు పవన్, గంగాధర్, ఎజాజ్ ఖాన్, రమేష్ సెట్,దిలీప్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Job Mela in Yellareddy | ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

Ugadi Celebrations Nizamabad | నగరంలోని నవదుర్గ దేవాలయంలో ఉగాది వేడుకలు
Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..
Head Constable Death | గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:agriculture news indiaBanswada FarmersFarmer SupportGunny Bags SupplyPaddy procurementPaddy Procurement SuppliesPocharam Srinivas ReddyRice ProcurementTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Siddhartha College Farewell Siddhartha College Farewell | సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఫేర్‌వెల్ డే’
Next Article Andhra Pradesh New Map Andhra Pradesh New Map | ఏపీ కొత్త మ్యాప్​ విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?