అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Sanjay Flexies | నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిల్ ఫర్ సంజయ్’ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. నిజామాబాద్ తొలి మేయర్ (Nizamabad First Mayor) అయిన సంజయ్‌కి న్యాయం చేయాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
Sanjay Flexies | పార్టీల తనకు గుర్తింపు లేదంటూ..
అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (Municipal Corporation elections) పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) కృషి చేశారని అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చేందుకు వైఎస్‌తో కలిసి డీఎస్ ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన కుమారుడికి పార్టీలో ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ఫ్లెక్సీల్లో ఆయన అభిమానులు ప్రశ్నించారు.

Sanjay Flexies | బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేరుతో..
నిజామాబాద్ (Nizamabad) యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేర్లతో కూడిన ఈ ఫ్లెక్సీల్లో డి.సంజయ్ వెంటే తాము ఉంటాయని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే తాముంటాని పేర్కొన్నారు. అలాగే నగరంలోని ధర్నాచౌక్ వద్ద ధర్మపురి సంజయ్ అభిమానుల పేరుతో శనివారం ఉదయం నిరాహార దీక్ష సైతం చేపట్టారు. డీఎస్‌కు కొడుకు సంజయ్‌కి పదవి ఇచ్చి గౌరవించాలని వారు కోరారు. అయితే తాజాగా వెలిసిన ఫ్లెక్సీల అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి..: Siddhartha College Farewell | సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘ఫేర్‌వెల్ డే’
