Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్​

హైదరాబాద్

Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్​

మాదాపూర్‌లోని త‌మ్మిడికుంట‌, సున్నం చెరువుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. రెండు నెలల్లో చెరువులను పునరుద్ధరించాలని ఆదేశించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 6:36 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Hyderabad Lakes Restoration

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Restoration | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని చెరువుల పునరుద్ధరణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. అంబర్​పేటలోని బతుకమ్మ కుంట, ఓల్డ్​ సిటీలోని బమృక్​ నౌద్దౌలా, కూకట్​పల్లి నల్లచెరువులను పునరుద్ధరించి ప్రారంభించింది.

నరగంలోని మరికొన్ని చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా మాదాపూర్‌ (Madhapur)లోని త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ శ‌నివారం ప‌రిశీలించారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై అధికారులతో స‌మీక్షించారు. రెండు నెల‌ల్లో చెరువుల అభివృద్ధి ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఐటీ కారిడార్​కు దగ్గర ఉన్న త‌మ్మిడికుంటను ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రంగా దిద్దాలని కమిషన్​ సూచించారు. చెరువు చుట్టూ మొక్కలు పెంచాలన్నారు. పాత్ వేలు, కూర్చొని సేద దీరేందుకు వీలుగా సీటింగ్ వ్య‌వ‌స్థ‌, పార్కులు, ప‌చ్చిక బైళ్లు.. ఉండేలా చూడాల‌న్నారు.

Hyderabad Lakes Restoration | ఆ భూములను స్వాధీనం చేసుకోండి

చెరువుల చుట్టూ ఉన్న ప్ర‌భుత్వ భూముల గురించి స్వాధీనం చేసుకోవాలని రంగనాథ్​ ఆదేశించారు. సున్నం చెరువు దగ్గర స‌ర్వే నంబ‌రు 30, 31లో ప్ర‌భుత్వ భూమి ఉంటే కాపాడాలన్నారు. సున్నం చెరువు సమీపంలోని బోర‌బండ బ‌స్తీ, ఎన్ఆర్ఆర్ పురం నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీరు చెరువులోకి క‌లిసే ఇన్​లెట్లను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. మురుగు నీరు కింద‌కు పోయేలా డైవ‌ర్ట్ కాలువ నిర్మాణం కూడా పూర్త‌య్యింద‌ని అధికారులు వివ‌రించారు.

దీనిని కూడా చదవండి : Encroachment Drive | ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్​లో ఉద్రిక్తత

Hyderabad Mosquito Menace | హైదరాబాద్​లో దోమల బెడద.. ఎమ్మెల్యే వినూత్న నిరసన
Narsingi Tragedy | హైదరాబాద్​లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం
Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Cyberabad Traffic Kindness | మానవత్వం చాటిన సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు
Telangana Chicken Shops | తెలంగాణలో చికెన్ షాపుల బంద్ ప్రారంభం.. స్నేహా అవుట్‌లెట్స్ వద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం..
TAGGED:Hyderabad LakesHyderabad newsLake RestorationTelangana developmenturban lakes India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dharmapuri Sanjay Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Next Article Armoor Peace Rally | Armoor Peace Rally | ఆర్మూర్​లో ఘనంగా శాంతి ర్యాలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?