అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Drugs Party | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. పబ్‌లు, రిసార్టులు, ఫామ్‌హౌజ్‌లలో ప్రత్యేకంగా డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈగల్ టీమ్ (Eagle Tea) పోలీసులు శనివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారామతి రిసార్ట్ (Taramati Resort)లో దాడి చేశారు. 36 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
ఇబ్రహీంబాఘ్‌లోని తారామతి బరదరిలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒక మహిళతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు, ‘మోర్ దాన్ ఫ్రెండ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ పార్టీపై ఈగల్ బృందాలు దాడి చేశాయి. ఈ పార్టీలో ఎలక్ట్రానిక్ సంగీత ప్రదర్శనలు జరగాల్సి ఉంది.
Hyderabad Drugs Party | ప్రదర్శన జరుగుతుండగా..
రిసార్ట్‌లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మ్యూజిక్ కచేరి ప్రారంభం అయింది. హాజరైన వారిని అలరించడానికి పలువురు డీజేలు, ప్రదర్శకులు వచ్చారు. ఈ సమయంలో పోలీసులు దాడులు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అక్కడే పరీక్షలు చేశారు. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డీజేప్లేయర్ జాసన్ అనే వ్యక్తి ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో దంపతులు నిహార్, ఆశి ఉన్నారు. మోడల్ అబ్దుల్ సర్వర్, వ్యాపారి యోగేశ్వర్, ఫార్మా ఉద్యోగి అవినాష్ పాణికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది.
ఇది కూడా చదవండి : Hyderabad suicide case | ఐదేళ్ల ప్రేమ.. పెళ్లయిన 50 రోజులకే యువతి ఆత్మహత్య
