అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eatala Rajender Comments | మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీ (BJP)కి రాజీనామా చేస్తారని ఇటీవల ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. తాను పార్టీ మారుతానని పిచ్చి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ (BRS) హయాంలో మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. హుజురాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అనంతరం ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హుజురాబాద్‌లో ఓడిపోయారు. దీంతో బీజేపీ ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వగా.. విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన పార్టీ మారతారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో కొందరు ఆ ప్రచారానికి ఊతమిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Eatala Rajender Comments | ప్రభుత్వంపై ఉద్యమం చేస్తాం
తనను కేసీఆర్ (KCR) బయటికి నెట్టి ఐదేళ్లవుతుందని ఈటల రాజేందర్ అన్నారు. ఆనాడు చెప్పుకుందామన్నా ఎవరూ వినలేని పరిస్థితి ఉందని గుర్తు చేసుకున్నారు. తాను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదన్నారు. పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని ఆయన తెలిపారు. జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుపై సుప్రీంలో కేసువేస్తామని చెప్పారు. GHMCఎన్నికలపై ఎంపీలు రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వరరావుతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని ఈటల పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Encroachment Drive | ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు.. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత
