అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Land Scam | హైదరాబాద్ (Hyderabad) నగరంలో రూ.7 వేల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములకు రక్షణలేకుండా పోయిందన్నారు.
తెలంగాణ భవన్లో హరీశ్‌రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. నగరంలోని నాదర్‌గుల్ (Nadergul) భూములు భూములను కొందరు ఆక్రమించారరన్నారు. ప్రభుత్వ పెద్దలే గద్దల్లా తన్నుకుపోతున్నారని ఆరోపించారు. రక్షకులే భక్షకులు అయ్యారన్నారు. చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ భూములను కాపాడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు.
Hyderabad Land Scam | నిషేధిత జాబితాలోకి..
రంగారెడ్డి (Rangareddy) జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని 373 ఎకరాల భూమి శివరాజ్ బహదూర్‌కు చెందిందని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. 2016లో ఆయన ఆ భూమిని కొన్ని కంపెనీలకు విక్రయించగా.. బదలాయింపు కోసం కంపెనీలు ఆర్డీవో దగ్గరకు వెళ్లాయన్నారు. అయితే ఆ భూమిని విక్రయం చెల్లదని ఆర్డీవో చెప్పినట్లు హరీశ్‌రావు తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక్క వ్యక్తికి అంత భూమి ఉండదని చెప్పి.. దానిని నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. RDO నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందని చెప్పారు. భూములపై సుప్రీం ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. భూభారతి వెబ్‌సైట్‌లో సైతం ఆ భూమి ప్రభుత్వ భూమిగా ఉందన్నారు.
Hyderabad Land Scam | బౌన్సర్లను పెట్టి..
నాదర్గూడలోని 373 ఎకరాల భూమిని నమ్ముకొని 600 మంది పేద రైతులు బతుకుతున్నారని చెప్పారు. అయితే ఆ భూములను కొందరు కబ్జా చేశారన్నారు. గోడలు కట్టి, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఆ భూముల్లోకి వెళ్లకుండా రైతులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బౌన్సర్లను, పోలీసులను పెట్టి వాళ్ల భూముల దగ్గరికి పోనీవకుండా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు ఫిర్యాదు చేసినా ఆర్డీవో, హైడ్రా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూముల్లోని చెరువులు, గుట్టలను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూముల కబ్జాలో ఓ మంత్రి హస్తం ఉందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి : Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు
